బ్రహ్మోత్సవం వచ్చేస్తుంది..

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న విధంగా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ వాయిదా ప‌డింది. ఆత‌ర్వాత కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత మే సెకండ్ వీక్ లో నే బ్ర‌హ్మోత్స‌వం వ‌చ్చేస్తుంది అన్నారు. కానీ..డేట్ మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.
ఆత‌ర్వాత మే 6న బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ అంటూ మ‌ళ్లీ వార్త‌లు వ‌చ్చాయి కానీ..షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డంతో డేట్ మారే అవ‌కాశం ఉంద‌నుకున్నారు. అయితే షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో మే 6న బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ ఖాయం అంటున్నారు చిత్ర‌యూనిట్. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈనెల 10 వ‌రకు టాకీ పూర్తి చేసి 11 నుంచి 20 వ‌ర‌కు పూణెలో రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తే షూటింగ్ పూర్త‌వుతుంది. ఆత‌ర్వాత ఈనెల 24న ఆడియో రిలీజ్ చేసి మే 6న బ్ర‌హ్మోత్స‌వం సినిమాని రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

More News

నాగ్ స్టూడియోలో వెంకీ మూవీ...

టాలీవుడ్ కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న బాబు..బంగారం షూటింగ్ జరుపుకుంటుంది.

సర్ధార్ ఇంటర్వెల్ డైలాగ్ ఇదే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని డైరెక్టర్ బాబీ ఇంటర్ వ్యూలో చెప్పారు.

'ఈడోరకం ఆడోరకం' సెన్సార్ డేట్....

మంచు విష్ణు,రాజ్ తరుణ్,సోనారిక,హేబా పటేల్ హీరో హీరోయిన్స్ గా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్ర 'ఈడోరకం ఆడోరకం'.

నిర్మాతగా సమంత...

టాలీవుడ్,కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత త్వరలోనే ప్రొడ్యూసర్ గా మారనుంది.

నానితో ముంబై మోడల్...

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస సక్సెస్ లు సాధిస్తున్నాడు.