న్యూ షెడ్యూల్ లో బ్రహ్మోత్సవం...

  • IndiaGlitz, [Monday,January 18 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్నతాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ ను రామోజీ ఫిలింసిటీ, చెన్నైల్లో జ‌రిపారు. చెన్నైలో అంబ‌త్తుర్ ఇండ‌స్ట్రీయ‌ల్ ఎస్టేట్ లో మ‌హేష్, స‌త్య‌రాజ్ ల‌పై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.
సంక్రాంతికి కాస్త గ్యాప్ ఇచ్చిన బ్ర‌హ్మోత్స‌వం టీమ్ ఈనెల 19 నుంచి న్యూషెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగే ఈ న్యూ షెడ్యూల్ లో మ‌హేష్, స‌మంత ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వం అర‌వై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నబ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ ను త్వ‌ర‌గా పూర్తి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా బ్ర‌హ్మోత్స‌వం సినిమాని ఏప్రిల్ 29న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చిరు 150 సినిమాపై క్లారిటి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చిరు 150వ సినిమాగా తమిళ్ లో ఘన విజయం సాధించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

అభిమానులు కొట్టుకున్నారు....

హీరోలు బాగానే ఉంటున్నారు, కానీ అభిమానులే కొట్టుకుంటున్నారు. అభిమానం హద్దులో ఉంటేనే బావుంటుంది. ఆ హద్దు దాటితేనే గొడవలు అవుతుంటాయి. నిన్న బాలకృష్ణ, నాగార్జున అభిమానుల విషయంలో అదే జరగింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు కూడా ఉన్నాయి.

నాని ఓవర్ సీస్ హక్కులు వీరివే...

ప్రముఖ నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని,మెహరీన్(నూతన పరిచయం)హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'.

బాలయ్య హిస్టారికల్ సినిమా చేస్తాడా?

99వ సినిమా డిక్టేటర్ సినిమాతో సందడి చేసిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వందో సినిమాకు రెడీ అవుతున్నాడు.

కొత్తగా ఆలోచిస్తున్న జగపతి...

సీనియర్ హీరోగా వంద సినిమాలు చేసిన జగపతిబాబు ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు.రీసెంట్ గా నాన్నకుప్రేమతో చిత్రంలో విలన్ గా నటించిన జగపతిబాబు నటనకు మంచి పేరు వచ్చింది.