మ‌హేష్ ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్న సెంటిమెంట్..

  • IndiaGlitz, [Thursday,April 14 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం చిత్రానికి మిక్కి జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మే 1న బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను తిరుప‌తిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం చిత్రాన్ని మే 13న రిలీజ్ చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే...ఓ సెంటిమెంట్ మహేష్ ఫ్యాన్స్ ని తెగ టెన్ష‌న్ పెడుతుంది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏమిటంటే...మ‌హేష్ న‌టించిన నాని, నిజం చిత్రాలు మే నెల‌లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలు ఏమాత్రం ఆక‌ట్టుకోలేక ఫ్లాప్ మూవీస్ గా నిలిచాయి. ఇప్పుడు మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం చిత్రాన్ని మే 13 న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో మ‌హేష్ కి మే నెల క‌ల‌సి రాలేదు. ఈసారి ఎలాంటి రిజల్ట్ వ‌స్తుందో అని మ‌హేష్ ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. మ‌రి..మ‌హేష్ మే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

More News

పోలీసోడు ర‌న్ టైమ్..

త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన తెరి చిత్రం తెలుగులో పోలీసోడు టైటిల్ తో రిలీజ్ అవుతుంది. విజ‌య్ స‌ర‌స‌న స‌మంత‌, అమీ జాక్స‌న్ న‌టించారు. అట్లీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

నాగ్ కెరీర్ లో ఊపిరి ఆల్ టైమ్ రికార్డ్

మనం,సోగ్గాడే చిన్ని నాయనా,ఊపిరి...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.

'పోలీసోడు'కి టైటిల్ సమస్య....

విజయ్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పోలీసోడు'.

ఏ హీరో ఇలాంటి సినిమా చేయడానికి ఒప్పుకోడు..ఊపిరి ఒక్క నాగార్జునకే సాధ్యం - దర్శకరత్న దాసరి

మనం,సోగ్గాడే చిన్ని నాయనా,ఊపిరి...ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున.

అ ఆ టీజ‌ర్ అ ఆ

యువ క‌థానాయ‌కుడు నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం అ ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనందవిహారి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న స‌మంత‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.