ఊటీలో బ్ర‌హ్మోత్స‌వం

  • IndiaGlitz, [Monday,November 23 2015]

మ‌హేష్ హీరోగా పి.వి.పి. సినిమా ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. పెర‌ల్‌.వి.పొట్లూరి, ప‌ర‌మ్‌.వి.పొట్లూరి నిర్మాత‌లు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ''ఇప్ప‌టిదాకా రెండు షెడ్యూళ్ళు చేశాం. ఈ నెల 28 నుంచి మూడో షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో మొద‌లుపెడుతున్నాం. డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో షూట్ చేసి ఊటీకి షిప్ట్ అయి డిసెంబ‌ర్ 10 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు అక్క‌డ చేస్తాం. ఊటీలో చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ పాల్గొనే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తాం'' అని అన్నారు.

ప్ర‌సాద్‌.వి.పొట్లూరి మాట్లాడుతూ ''ఒక అద్భుత‌మైన క‌థ‌తో, అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో, భారీ తారాగ‌ణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కెరీర్ కి, మా బేన‌ర్‌కి ఇది ఒక ప్రెస్టీజియ‌స్ మూవీ అవుతుంది'' అని అన్నారు. స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ప్ర‌ణీత నాయిక‌లు. ఈ చిత్రంలో స‌త్య‌రాజ్‌, జ‌య‌సుధ‌, రేవ‌తి, న‌రేష్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, తుల‌సి, ఈశ్వ‌రీరావు, సాయాజీ షిండే, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ర‌జిత‌, కాదంబ‌రి కిర‌ణ్‌, చాందిని చౌద‌రి ఇత‌ర పాత్ర‌ధారులు. కెమెరా: ఆర్‌.ర‌త్న‌వేలు, సంగీతం: మిక్కీ.జె.మేయ‌ర్‌, డాన్స్: ర‌ఆజు సుంద‌రం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: స‌ందీప్ గుణ్ణం.

More News

న‌వ యువ సంచ‌ల‌నం నాగ చైత‌న్య‌..హ్యాపీ బ‌ర్త్ డే

అక్కినేని వంశం మూడోత‌రం క‌థానాయ‌కుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన న‌వ యువ సంచ‌ల‌నం నాగ చైత‌న్య‌. నాగార్జున వార‌సుడుగా ప‌రిచ‌య‌మైన నాగ చైత‌న్య అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్నాడు.

డిసెంబర్ 4న వస్తున్న'మేము'

సూపర్ స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న తమిళ చిత్రం'పసంగ'2'తెలుగులో 'మేము' పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే.

'లోఫర్' ఆడియో డిసెంబర్ 7న

వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా లోఫర్.పూరి జగన్నాథ్ దర్శకుడు.సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై .లిమిటెడ్ పతాకంపై రూపొందింది.

మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'సరదా' ఫస్ట్ లుక్

మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న చిత్రం సరదా.

'సినీమహాల్' ఆడియో రిలీజ్

కళానిలయ క్రియేషన్స్ పతాకంపై సిద్దాంస్,రాహుల్,తేజస్విని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో తెరెక్కిన చిత్రం ''సినీ మహల్''.