నిమ్స్‌లో జరగాల్సిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్

  • IndiaGlitz, [Tuesday,July 07 2020]

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. క్లినికల్ ట్రయల్స్‌ను దేశ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి నిమ్స్‌లో ట్రయల్స్ జరగాల్సి ఉండగా.. ఐసీఎంఆర్ అనుమతి లభించకపోవడంతో వాయిదా పడింది. రెండు మూడు రోజుల్లో ఐసీఎంఆర్ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫేస్ 1, ఫేస్ 2 కింద జరుగుతాయి. ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని ఐసీఎంఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే.

More News

ఆ డిజాస్టర్ హీరోయిన్‌ను సరికొత్తగా మార్చిన వర్మ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన సినిమాలకు పైసా ఖర్చు లేకుండా ప్రతి గడపకూ తన సినిమాను చేర్చగల దిట్ట.

‘పవర్ స్టార్’లో వర్మ పవన్‌ను సీఎంని చేస్తారట..

పవన్ కల్యాణ్ బయోపిక్‌ను ‘పవర్ స్టార్’ పేరుతో వర్మ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీని కోసం అచ్చం పవన్‌లా ఉండే వ్యక్తిని కూడా వర్మ ఎంపిక చేసుకున్నారు.

ప్రధాని మెచ్చిన ప్రతాప్.. ఎంతటి విజయాన్ని సాధించాడో తెలిస్తే

కర్ణాటకలోని మైసూరుకు సమీపంలోని కాడైకుడికి చెందిన ప్రతాప్(21) పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగుతోంది.

క్లారిటీ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌పుత్‌

తొలి తెలుగు చిత్రం ‘ఆర్‌.ఎక్స్‌100’తో హాట్ బ్యూటీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌కు త‌ర్వాత చేసిన ‘ఆర్.డి.ఎక్స్ ల‌వ్‌, వెంకీమామ‌,

టీచర్ పాఠం చెబుతుండగా.. క్లాస్ రూంలోకి సడెన్‌గా వచ్చిన ఏనుగు..

టీచర్ ఏనుగు గురించిన పాఠం చెబుతోంది. ఆమె వన్.. టు.. త్రి అనగానే క్లాస్ రూంలోకి ఏనుగు వచ్చి చిన్నారుల ముందు నిలబడింది. పిల్లలంతా షాక్ అయ్యారు.