నాజ‌ర్‌ పై సోద‌రుల ఆరోప‌ణ‌లు

  • IndiaGlitz, [Monday,May 20 2019]

సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్‌ పై అత‌ని సోద‌రులు ఆయ‌బ్‌, జ‌వ‌హ‌ర్ మీడియా ముఖంగా ఆరోప‌ణ‌లు చేశారు. నాజ‌ర్ కుటుంబంలో న‌లుగురు అబ్బాయిలు అందులో చివ‌రి వాడు మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు.

పెద్దవాడైన నాజ‌ర్ పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌మ‌కు దూరంగా వెళ్లిపోయాడ‌ని, త‌ల్లిదండ్రుల‌కు ఎలాంటి ఆర్ధిక సాయం చేయ‌క‌పోగా.. వారిని క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా రావ‌డం లేద‌ని వారు తెలిపారు.

నాజ‌ర్ ప్ర‌వ‌ర్త‌న ఇలాగే ఉంటే ఆయ‌న‌ పై చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డింఆచ‌రు. దీనిపై నాజ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.