Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు

  • IndiaGlitz, [Saturday,March 11 2023]

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఆమెతో పాటు భర్త అనిల్ కుమార్, న్యాయవాదులు వున్నారు. రెండ్రోజుల క్రితమే ఢిల్లీకి వచ్చిన కవిత.. శుక్రవారం మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. దీక్ష ముగిసిన వెంటనే బీఆర్ఎస్ లీగల్ ప్రతినిధులతో ఆమె భేటీ అయ్యారు. అనంతరం శనివారం తుగ్లక్ రోడ్‌లోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి భర్తతో కలిసి చేరుకున్నారు కవిత. ఆమెకు మద్ధతుగా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

రిమాండ్ రిపోర్టులలో పలుమార్లు కవిత పేరు :

ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో సీబీఐ అధికారులు సైతం ఆమెను విచారించారు. ఆ తర్వాత విషయం సద్దుమణగగా..మళ్లీ అనూహ్యంగా మనీష్ సిసోడియా, రామచంద్రపిళ్లైల అరెస్ట్‌ తర్వాత నెక్ట్స్ టార్గెట్ కవితేనంటూ ప్రచారం జరిగింది. బీజేపీ నేతలు సైతం ఈ విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో రాజకీయాలు వేడెక్కాయి. అటు కస్టడీలో వున్న రామచంద్రపిళ్లై సైతం తాను కవిత బినామీనేనని వాంగ్మూలం ఇవ్వడం.. ఆ తర్వాత తన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానంటూ పిటిషన్ వేయడం వంటి వ్యవహారాలతో శుక్రవారం హైడ్రామా నడిచింది.

అరెస్ట్ చేస్తే భయపడేది లేదన్న కేసీఆర్ :

మరోవైపు.. కవితకు ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పందించారు. కవితను అరెస్ట్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరని నేతలను వేధిస్తున్నారని, కవితను కూడా పార్టీలో చేరమన్నారని.. ఆమె నిరాకరించడంతోనే కేసులతో వేధిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. అరెస్ట్ చేసినా పర్లేదని.. భయపడేది లేదని, పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశం నుంచి పారద్రోలుదామని కేసీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

More News

Ex CM Kiran Kumar:బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు వ్యతిరేకించి సొంతపార్టీపైనే పోరాటం చేశారు.

Tammareddy:బూతులు నాకూ వచ్చు, కానీ సంస్కారం అడ్డొస్తోంది.. నాకు ఐడెంటిటీ అక్కర్లేదు: నాగబాబుకు తమ్మారెడ్డి కౌంటర్

ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ చిత్రం యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే.

Katha Venuka Katha:‘కథ వెనుక కథ’ నుంచి ‘నిన్ను చూసీ చూడంగా...’ లిరికల్ సాంగ్ రిలీజ్

నిన్ను చూసీ చూడంగా నా కన్నె న‌న్ను దాటి నీ వైపొస్తుందే

Actor Naresh:త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి అన్నీ చెబుతా - పవిత్రా లోకేష్‌తో పెళ్లి వీడియోపై నరేష్ రియాక్షన్

గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సీనియర్ నటులు నరేష్, పవిత్రా లోకేష్‌లు పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో కథనాలు వినిపిస్తున్నాయి.

Secretariat:తెలంగాణ కొత్త సచివాలయానికి ముహూర్తం ఫిక్స్.. అంబేద్కర్ విగ్రహానికి కూడా, ఎప్పుడంటే..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది.