BRS MLC Kalvakuntla:రష్మిక డీప్ ఫేక్ వీడియో వ్యవహారం : కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి, మహిళలను కాపాడాలంటూ రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి

  • IndiaGlitz, [Tuesday,November 07 2023]

టాలీవుడ్ అగ్రకథానాయిక, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ముఖ్యంగా మహిళలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి జరగకుండా చూడాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (గతంలో ట్విట్టర్ ) సైబర్ ముప్పు నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం వుందని.. ఇందుకోసం పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు కవిత విజ్ఞప్తి చేశారు. అలాగే రష్మిక వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ట్యాగ్ చేశారు.

కాగా.. రష్మిక మందన్నా పేరుతో వైరల్ అవుతోన్న మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. అందులో రష్మిక ఎక్స్‌పోజింగ్ చేసినట్లుగా వుంది. దీనిని చూసిన వారంతా నిజంగానే రష్మిక అంత పనిచేసిందా అన్నట్లు నోరెళ్లబెట్టారు. కానీ కొద్దిసేపటికే అది ఫేక్ వీడియో అని తేలడంతో మహిళా లోకం, ముఖ్యంగా సినీ ప్రముఖులు , రష్మిక అభిమానులు సైతం మండిపడుతున్నారు. దీని ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆ వీడియోను ఎవరో రష్మిక ఫేస్‌తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లుగా గుర్తించారు.

దేశవ్యాప్తంగా పెను దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఇంటర్నెట్‌ను వినియోగించే వారికి భద్రత కల్పించే విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఫేక్ సమాచారాన్ని గుర్తిస్తే.. దానిని 36 గంటల్లోగా తొలగించాలి. లేనిపక్షంలో రూల్ 7 కింద.. సదరు సామాజిక మాధ్యమాలను న్యాయస్థానం ముందు నిలబెట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అని.. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలని రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

More News

Rashmika:రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఏమన్నారంటే..?

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్నాయి. పోలింగ్‌కు మరో 22 రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

KCR: కేసీఆర్ వాక్చాతుర్యం.. మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలే..

తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తొమ్మిదేన్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించారు.

Mogalirekulu actor Sagar:జనసేన పార్టీలో చేరిన 'మొగలిరేకులు' నటుడు సాగర్

చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌తో ఫేమస్ అయిన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు జనసేన పార్టీలో చేరారు.

Congress and CPI:కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన పొత్తు.. ఒక సీటు, రెండు ఎమ్మెల్సీలకు అంగీకారం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటుంది.