Kavitha Arrest: బిగ్ బ్రేకింగ్: లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

  • IndiaGlitz, [Friday,March 15 2024]

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు గంటల పాటు సోదాల అనంతరం ఆమె ఫోన్లు సీజ్ చేసి అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే తనను ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కాసేపట్లో ఆమెను విమానంలో ఢిల్లీకి తరించనున్నారు. అధికారులు సోదాలకు వచ్చేటప్పుడు కవితతో పాటు వారికి కూడా విమానం టికెట్లు బుక్ చేసుకుని వచ్చారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ముందుగా ప్లాన్ ప్రకారమే వచ్చారని అర్థమవుతోంది.

మరోవైపు కవిత ఇంటి వద్దకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేరుకుని అధికారులతో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా కవిత ఇంటి దగర్గకి చేరుకుని ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని నేతలు చెబుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడటంతో పోలీసులు భారీగా మోహరించారు. కవిత ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు.

కాగా లిక్కర్ కేసులో ఆమెను ఇటీవల సీబీఐ నిందితురాలిగా చేర్చిన సంగతి తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకావాలని సీబీఐతో పాటు ఈడీ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఈడీ సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 19న విచారణ జరపనున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది.

గతేడాది మార్చిలో కవితను మూడు సార్లు ఢిల్లీలో ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణకు సహకరించిన కవిత.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె వినియోగించిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సైతం వారికి అప్పగించారు. అప్పుడు రోజుకు దాదాపు 10 గంటలకు పైగా కవితను విచారించారు. అంతసేపు విచారించడంతో ఆమె అరెస్ట్ ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అప్పటినుంచి ఆమె విచారణ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు ఏకంగా ఆమెను ఇంట్లోనే అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

 
 

More News

నిజంకాని సీ-ఓటర్‌ సర్వేలు.. పచ్చ తమ్ముళ్లను చూసి నవ్వుకుంటున్న జనాలు..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి.

Sharmila: అన్నా అని పిలిపించుకున్న వారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల

వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు ఎవరో కాదని.. బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు.

MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు.. గులాబీ నేతల్లో టెన్షన్..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది.

Mudragada: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

ఎట్టకేలకు కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ముద్రగడకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Election Schedule: రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన.. కౌంట్‌డౌన్‌ షూరూ..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు(శనివారం) నగారా మోగనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది.