డిసెంబర్ 8న విడుద‌ల‌వుతోన్న 'బీటెక్ బాబులు'

  • IndiaGlitz, [Friday,December 01 2017]

నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్ పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం 'బీటెక్ బాబులు'. శ్రీను ఈ మంది దర్శకత్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని తెలుగు రాష్ర్టాల్లో డిసెంబ‌ర్ 8న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భం గా హీరో నందు మాట్లాడుతూ, "పెళ్ళిచూపులు త‌ర్వాత చాలా మంచి పాత్ర ఈ సినిమాలో ద‌క్కింది. నా పాత్ర ప్ర‌తీ ప్రేమికుడిగా క‌నెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. శ్రీ ముఖికి ...నాకు మ‌ధ్య‌ వ‌చ్చే ప్రేమ స‌న్నివేశాలు హృద‌యాన్ని హ‌త్తుకుంటాయి. సీరియ‌స్ గా ల‌వ్ ట్రాక్ న‌డుస్తూనే...న‌వ్వులు పువ్వులు పూయించే కామెడీ స‌న్నివేశాలు కూడా హైలైట్ గా ఉండేలా ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా తెరకెక్కించారు. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. సినిమాపై యూనిట్ అంతా చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం. ప్రేక్ష‌కులు కూడా మాచిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా" అని అన్నారు.

నటుడు ఆలీ మాట్లాడుతూ, "చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మ‌ళ్లీ స్పూప్ చేశా. స‌రైనోడు స్పూప్ అద‌రొట్టాన‌ని అంతా అంటున్నారు. ఇప్పటికే
స్పూఫ్ ట్రైలర్ కు సోషల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అయింది. శ్రీను కొత్త కుర్రాడైనా అనుభ‌వం గ‌ల డైరెక్ట‌ర్ లా క‌థ‌ను డీల్ చేశాడు. సినిమా విజయం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా" అని అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీను ఈ మంది మాట్లాడుతూ, "మంచి కంటెంట్ తో తెర‌కెక్కించాం. ఇంజనీరింగ్ చ‌దువుకుంటోన్న న‌లుగురు విద్యార్ధుల జీవితాలు ఎలా ఉంటాయి? రెగ్యుల‌ర్ గా వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ప్రియురాలి ప్రేమ గొప్ప‌దా? త‌ల్లిదండ్రుల ప్రేమ గొప్ప‌దా? అనే అంశాల‌కు హాస్యం..సెంటిమెంట్ స‌న్నివేశాలు జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విధంగా తెర‌కెక్కించాం. ముఖ్యంగా యువ‌త‌ను టార్గెట్ చేసే సినిమా అవుతుంది.

ఇప్ప‌టికే రిలీజైన ప్ర‌చార చిత్రాల‌కు అంద‌రి నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. చిన్న సినిమా అయినా క్వాలిటీ పరంగా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాం. తప్ప‌కుండా మా సినిమాని అంద‌రూ ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం" అని అన్నారు.

శకలక శంకర్ మాట్లాడుతూ, "శంకర్ ఫ్రమ్ శ్రీకాకుళం గా అనే పాత్ర‌లో క‌నిపిస్తాను. క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉంటుంది. ఇందులో ద‌ర్శ‌కుడు నాతో చిన్న చిన్న స్టెప్పులు కూడా వేయించారు. సెంటిమెంట్ స‌న్నివేశాలు హైలైట్ గా తీర్చిదిద్దారు. సినిమా తప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది" అని అన్నారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ,"ఇందులో తాగుబోతు గానే కాకుండా కామెడీ దొంగగా పూర్తి స్థాయిలో కనిపిస్తా. కథ నాతోనే మొద‌ల‌వుతుంది...నాతోనే ముగుస్తుంది. ఆనందో బ్రహ్మ తర్వాత రంగా ది దొంగగా అంద‌ర్నీ మెప్పిస్తాను. డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం" అని అన్నారు.

ఈ చిత్రంలో అలీ, శ‌క‌ల‌క శంక‌ర్, తాగుబోతు ర‌మేష్‌, వైజాగ్ శంక‌ర్, వైవా హ‌ర్ష‌, సూర్య‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాఘ‌వ‌, ప‌టాస్ ప్ర‌కాశ్, నోవ‌ల్ కిషోర్, రాణి, ఖుష్బు, ప‌విత్ర లోకేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

More News

నాగార్జున చేతుల మీదుగా 'ఏక్‌' మూవీ ఆడియో విడుదల

కె వరల్డ్ మూవీస్ బ్యానర్ పై రుద్రారపు సంపత్ డైరెక్షన్ లో బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ హీరోహీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం 'ఏక్'.

బాలకృష్ణ 'జై సింహా' టాకీ పార్ట్ పూర్తి

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార

'సైరా' గురించి క్లారిటీ ఇచ్చిన థమన్

'ఖైదీ నెం.150' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. చిరు 151వ చిత్రంగా 'సైరా' రూపుదిద్దుకుంటోంది.

'భరత్ అనే నేను' ఆడియో రైట్స్.. ఆ సంస్థకే

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

విశాల్ కోసం ధనుష్ పాట

తమిళ చిత్రాల కథానాయకుడు ధనుష్.. బహుముఖప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా గానం, నిర్మాణం, దర్శకత్వం.. వంటి విభాగాల్లోనూ రాణించారు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో.