జీవీఎల్, విజయసాయిపై బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

మే-23 తర్వాత వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు, వైసీపీ ఎంపీ విజయసాయిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో బీజేపీ పరిస్థితిని జీవీఎల్‌పై విసిరిన చెప్పు చెప్పకనే చెబుతోంది. జీవీఎల్ కాదు.. ఆయన జోవీఎల్ నరసింహారావు. విజయసాయిరెడ్డి ఈ రోజు జేడీ లక్ష్మినారాయణపై ట్వీట్‌లు పెడుతున్నారు. విజయసాయి చరిత్ర మొత్తం జేడీ వద్ద ఉంది. జీవీఎల్ మైక్‌లలో.. విజయసాయి ట్వీటర్‌లో మొరుగుతున్నారు.జీవీఎల్‌పై చెప్పులు విసిరినట్టు.. విజయసాయికి మే 23 తరువాత చెప్పుదెబ్బలు తప్పవు. ఎన్నికల ఫలితాలు రాలేదు ప్రజలు మాత్రం చంద్రబాబుకు పట్టం కట్టాం అని చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు వైఎస్ జగన్ దోచుకున్నారు. ప్రజలను దోచుకొన్నందుకు ఆయనకు ఓట్లు వేస్తారా..? అసలు ప్రజలు జగన్‌కి ఎందుకు ఓటు వేసారో ఆ పార్టీ నేతలు చెప్పాలి అని బుద్ధా విమర్శలు గుప్పించారు.

అందుకే బాబుకు ఓట్లేశారు..!

సంక్షేమ పథకాలకు, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడినందుకు చంద్రబాబుకు ఓట్లు వేస్తారు. జగన్ వస్తాడు అని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారానికే ప్రజలు భయపడుతున్నారు. చంద్రబాబు దెబ్బకు మోదీ కూడా అబ్బా అంటున్నాడు. మోదీకి ప్రతి రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తోంది. మోదీ దిగిపోగానే విజయసాయి జీవితాంతం చిప్పకూడు తింటాడు. జీవీఎల్ చేతిసంచితో మరోసారి దేశం మొత్తం తిరగాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఒక్కో సీట్‌కు జగన్ 7-8 కోట్లు చొప్పున 8వేల కోట్లు ఖర్చుచేసారు. పెద్దనోట్లు రద్దుతో జగన్, విజయమాల్య లాంటివాళ్లకు మోదీ మేలు చేశారు. జగన్‌కు రాజకీయ అవగాహన లేదు.. ఆయన తన ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో పోర్టు ఫోలియోలే కాదు.. కేంద్ర మంత్రి పదవులు కట్టబెడటనని చెప్పిన ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు తాగునీటిపై సమీక్ష చేస్తే ప్రతిపక్ష నేత ప్రధానికి ఫోన్ చేస్తాడు.. ప్రధాని ఈసీకి చెప్పి సమీక్షలు అడ్డుతగులుతున్నారు అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. బుద్ధా వ్యాఖ్యలపై వైసీపీ, బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

నిత్యం ప్రజలకు సేవ చేయడమే జనసేన చెప్పే థ్యాంక్స్

మనస్ఫూర్తిగా, నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మన పార్టీ  చెప్పే నిజమైన కృతజ్ఞత అవుతుంని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం!

శ్రీంలక రాజధాని కొలంబోలో జరిగిన ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది!.

బుల్లితెర‌పై

ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఆ తర్వాత అనేక మాధ్యమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తున్నాయి.

బిగ్‌బాస్ అనుష్క

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ కార్యక్రమానికి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో మొదటి బిగ్‌బాస్ షో జరిగిన విషయం తెలిసిందే.

షూటింగ్‌లో గాయపడ్డ విక్కీ

చాలా మంది హీరోలు తమ సినిమాలు సహజంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం ఎంత రిస్కయినా తీసుకోవడానికి సిద్ధపడతారు.