ఆకాశంలో ప్రభాస్ భారీ ఫైట్ కి అంత బడ్జెట్టా..!

  • IndiaGlitz, [Wednesday,October 26 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంది. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేష‌న్స్ సంస్థ 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం బాలీవుడ్ భామ ప‌రిణితి చోప్రా ను సంప్ర‌దిస్తున్నారు.
ఇదిలా ఉంటే...ఆ మూవీ కోసం ఆకాశంలో ఓ భారీ ఫైట్ చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ ఫైట్ కోసం హాలీవుడ్ టెక్నిషియ‌న్స్ ను తీసుకుంటున్నార‌ట‌. ఈ ఒక్క ఫైట్ సీన్ కోస‌మే 30 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. ఈ స్టంట్ కోస‌మే 30 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారంటే...ఈ ఫైట్ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈ భారీ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో ప్రారంభించనున్న‌ట్టు స‌మాచారం.

More News

'పిల్ల రాక్షసి' సెన్సార్ పూర్తి...నవంబర్ 4న విడుదల

'బిచ్చగాడు' వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని అందించిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం 'పిల్ల రాక్షసి'.

పుకార్ల పై క్లారిటి ఇచ్చిన కొర‌టాల‌..!

మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్...చిత్రాల‌తో వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. నాలుగ‌వ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ఉక్రెయిన్ లో విన్న‌ర్..!

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం విన్న‌ర్.ఈ చిత్రాన్ని  ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై   బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో  న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చ‌ర‌ణ్ జ‌గ‌దేక‌వీరుడు కి డైరెక్ట‌ర్ దొరికాడు..!

మెగాస్టార్ చిరంజీవి - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక‌సుంద‌రి. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

భర్త కోసం రంభ కోర్టులో పిటిషన్..!

తన అందం అభినయంతో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల తార రంభ.