నటుడు బ్రహ్మాజీకి రూ.4.65 కోట్ల బంపర్ ఆఫర్.. ట్విస్ట్ ఏంటంటే..

  • IndiaGlitz, [Friday,June 18 2021]

టాలీవుడ్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో బ్రహ్మాజీ ఒకరు. ఎప్పుడూ బిజీగా ఉండే నటుడు ఆయన. కామెడీ మిళితం చేసిన నెగటివ్ రోల్స్ లో బ్రహ్మాజీ అద్భుతంగా నటిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ టాలీవుడ్ హీరోలందరితో సన్నిహితంగా మెలిగే నటుడు ఆయన. అయితే తాజాగా బ్రహ్మాజీకి ఓ వింత అనుభవం ఎదురైంది.

ఇదీ చదవండి: హీరోయిన్లకు పెళ్లి, గర్భం అంటే పూరికి నచ్చదట!

స్మార్ట్ ఫోన్స్ వినియోగం, ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరిగాక సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. మీ మొబైల్ నంబర్ కు లక్కీ డ్రా తగిలింది. మీకు లక్షల్లో ఆఫర్ వచ్చింది. మీ బ్యాంక్ డీటెయిల్స్ పంపండి అంటూ చెత్త మెసేజ్ లు వస్తూ ఉంటాయి. వాటిని నమ్మి మోస పోతున్న అమాయకులు కూడా ఉన్నారు.

అయితే నటుడు బ్రహ్మాజీ మొబైల్ నంబర్ కు ఇలాంటి ఫ్రాడ్ మెసేజ్ ఒకటి వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారం బ్రహ్మాజీ ఏకంగా రూ. 4.65 కోట్లు గెలుచుకున్నారట. డబ్బు అందుకునేందుకు వివరాలు పంపాలని ఆ మెసేజ్ లో ఉంది. దీనిపై బ్రహ్మాజీ చాలా ఫన్నీగా పోలీసులకు ట్వీట్ చేశాడు.

'సర్.. ఈ నంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. వెళ్లి డబ్బు వసూలు చేసుకోండి' అని ట్వీట్ చేశాడు. బ్రహ్మాజీ ట్వీట్ పై నెటిజన్లు చాలా ఫన్నీగా రిప్లయ్ ఇస్తున్నారు.

More News

హీరోయిన్లకు పెళ్లి, గర్భం అంటే పూరికి నచ్చదట!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రాక్టికల్ గా ఉండే వ్యక్తి. ఆయన ఆలోచనలు కాస్తంత భిన్నంగానే ఉంటాయి.

హైదరాబాద్ జుమాటో డెలివరీ బాయ్ కోసం విరాళాలు.. హృదయాలు కదిలించేలా.. 

హైదరాబాద్ లో ఓ జుమాటో డెలివరీ బాయ్ విషయంలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు హృదయాలు హద్దుకుంటోంది.

బిగ్ సర్ ప్రైజ్: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ!

దక్షణాది సినీ అభిమానులకు ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. వైవిధ్య భరితమైన కథలని ఎంచుకుంటూ..

కరోనా వల్ల ఆగిపోయిన చిత్రాలు పూర్తయ్యాకే.. టాలీవుడ్ స్ట్రిక్ట్ రూల్స్!

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశవ్యాప్తంగా కాస్తంత తగ్గింది. దీనితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మళ్ళీ ఆశలు చిగురించాయి.

అది డిసైడ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్: వినాయక్

మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో ముణ్దు వరుసలో ఉంటారు వినాయక్. వినాయక్ సినిమాలు అనగానే..