శ్రీలంకలో బుర్ఖా పై నిషేధం.. ఎందుకంటే...!

  • IndiaGlitz, [Monday,April 29 2019]

శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. సుమారు 300మందికి పైగా ఈ పేలుళ్లలో మరణించగా అంతకు రెట్టింపు మంది క్షతగాత్రులై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ బురఖాలు దరించరాదని ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కాగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో ఉంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనే దానికి వివరణ కూడా ఇచ్చుకుంది. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని తెలిపారు.

కాగా.. అత్యవసర నిబంధనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిరిసేన తెలిపారు. ఇదంతా ప్రజా రక్షణ కోసమే అమలు చేస్తున్నామని మైత్రిపాల సిరిసేన చెప్పుకొచ్చారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా ఉండి నిందితులను త్వరగా గుర్తించేందుకే బుర్ఖాను నిషేధించాలని నిర్ణయించామన్నారు. అయితే శ్రీలంక సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ముస్లీం పెద్దలు, నేతలు కూడా అంగీకరించడం జరిగింది.

More News

చిత్రీకరణ చివరి దశలో ఆమని 'అమ్మ దీవెన'

సత్య ప్రకాష్  తనయుడు నటరాజ్ ను హీరోగా పరిచయం చెస్తూ, ఆమని, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతొన్న చిత్రం "అమ్మ దీవెన".

'ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్‌కు జోడీ దొరికింది!

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

రాహుల్‌ ఓడిపోతే రాజకీయాల్లో ఉండను.. మోదీకి ఓటమే!

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

'జెర్సీ' సినిమా ఎప్పటికీ పాతబడదు: రానా ద‌గ్గుబాటి

" 'జెర్సీ' సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. అందరూ పాతబడిపోవచ్చు కానీ, 'జెర్సీ' సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది" అని నాని అన్నారు.

నాకు జరిగిన అవమానం నన్ను షాక్‌కు గురిచేసింది!

తనకు జరిగిన అవమానం షాక్‌కు గురిచేసిందని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.