Pushpa 2: పుష్ప 2 యూనిట్‌తో వస్తున్న బస్సుకు ప్రమాదం.. ఆర్టిస్టులకు గాయాలు

  • IndiaGlitz, [Wednesday,May 31 2023]

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా పుష్ప పేరు బాగా వినిపించింది. వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా చిన్నారులైతే మెడ కిందగా చేతులు పోనిస్తూ నానా అల్లరి చేస్తున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నాయి. పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఇంతటి ప్రభంజనం సృష్టించిన పుష్పకి సీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ శివార్లలో ప్రమాదం:

ప్రస్తుతం పుష్ప 2ను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లిలో కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. అక్కడ షెడ్యూల్ ముగించుకుని యూనిట్ సభ్యులు హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో నగర శివార్లలో బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ఇందులో ప్రధాన తారాగణం ఎవ్వరూ లేరు. కేవలం జూనియర్ ఆర్టిస్టులు, మిగతా యూనిట్ సభ్యులు మాత్రమే సదరు బస్సులో వున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన వీరిని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు.

పుష్ప 1 సమయంలో అల్లు అర్జున్ కార్‌వాన్‌కు ప్రమాదం:

అయితే గతంలో పుష్ప పార్ట్ 1 సమయంలోనూ హీరో అల్లు అర్జున్‌కు చెందిన కార్‌వాన్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరి 6న రాజమండ్రి, మారేడుమిల్లి, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న కార్‌వాన్‌ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం సమయంలో అల్లు అర్జున్ అందులో లేరు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

More News

అల్లు అర్జున్ ఏషియన్ సత్యం థియేటర్ ఓపెనింగ్ డేట్స్ ఫిక్స్.. శ్రీరాముడి ఆశీర్వాదాలతోనే..?

తమ ముందు తరాల వారిని చూశారో.. లేక వ్యక్తిగత అనుభవమో కానీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు డబ్బును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

Avinash Reddy:అవినాష్ రెడ్డికి ఉపశమనం .. పచ్చ మీడియా కడుపు మంట, లైవ్ డిబేట్‌లో ఏకంగా జడ్జిలపైనే ఆరోపణలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

Srikanth Addala:మాస్ కథతో శ్రీకాంత్ అడ్డాల .. పేరు ‘‘పెద్ద కాపు’’, రక్తం మరకలతో ఆ చేతుల వెనుక కథేంటీ..?

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు వంటి అంశాల చుట్టూ సినిమాలు తీయడంలో

Kodali Nani:ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద అభిమానుల ఓవరాక్షన్ .. తారక్ ప్లేస్‌లో నేనుంటేనా : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు నిన్న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా

Nagababu:మీ ప్రోత్సాహం మరువలేనిది.. ఇదే స్పూర్తితో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం : ఎన్ఆర్ఐలతో నాగబాబు

జనసేన పార్టీ బలోపేతం కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదన్నారు