జనసేనాని ఆదేశాలతో బస్సు యాత్రం


Send us your feedback to audioarticles@vaarta.com


జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి బస్సు యాత్ర చేరుకుంది. జనసేన ఆధ్వర్యంలో కుమార సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధంలో భారత సైన్యానికి, ప్రధాని మోదీకి భగవంతుని ఆశీస్సులు, దైవబలం మెండుగా ఉండాలని ప్రార్ధిస్తూ మంత్రి దుర్గేష్ పూజలు నిర్వహించారు.
శత్రు సేనలను కట్టడి చేసి, దేశాన్ని కాపాడే గొప్ప శక్తిసామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి... వారి కోసం దేశమంతా ప్రార్థించే సమయమిదని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ పక్షాన షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.ఇందులో భాగంగా ప్రతి క్షేత్రానికి ఒక శాసన సభ్యుడు, జన సైనికులను పంపించి పూజలు చేయిస్తారు. ఇప్పుడు మంత్రి దుర్గేష్ అదే పనిచేశారు.
అదే విధంగా కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయాలు, ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం, పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని పవన్ కల్యాణ్ తెలిపారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com