close
Choose your channels

బుట్ట‌బొమ్మ స‌రికొత్త రికార్డ్‌

Saturday, April 4, 2020 • తెలుగు Comments

బుట్ట‌బొమ్మ స‌రికొత్త రికార్డ్‌

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో అల వైకుంఠ పుర‌ములో సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. పాట‌ల విష‌యానికి వ‌స్తే.. సినిమా విడుద‌ల‌కు ముందు లిరిక‌ల్ వీడియో సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..’, ‘రాములో రాముల ...’, ‘బుట్ట‌బొమ్మ..’ సాంగ్స్‌కు విప‌రీత‌మైన క్రేజ్ ద‌క్కింది. ఒక్కొక్క సాంగ్ వంద మిలియ‌న్ మార్కును చేరుకున్నాయి.

ఇక సినిమా విడుద‌ల త‌ర్వాత బుట్ట‌బొమ్మ సాంగ్ టాప్ సాంగ్‌గా నిలిచింది. ఆ సాంగ్‌లో మంచి ట్యూన్‌తో పాటు బ‌న్నీ డాన్స్ పెద్ద అడ్వాంటేజ్ కావ‌డంతో శిల్పాశెట్టి, దిశా ప‌టానీ వంటి బాలీవుడ్ హీరోయిన్స్‌కు కూడా పాట పిచ్చ పిచ్చ‌గా న‌చ్చింది. తాజాగా ఈ సాంగ్ ఓ కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. వంద మిలియ‌న్ వ్యూస్‌తో పాటు.. వ‌న్ మిలియ‌న్ లైక్స్‌ను సంపాదించుకుంది. వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌ను సంపాదించుకున్న తెలుగు పాట‌గా రికార్డ్ సాధించింది బుట్ట‌బొమ్మ‌.

Get Breaking News Alerts From IndiaGlitz