ప్రభుదేవా 'లక్ష్మి' సినిమా హక్కులు సొంతం చేసుకున్న సి. కళ్యాణ్

  • IndiaGlitz, [Friday,August 03 2018]

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'లక్ష్మి' సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు..ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతుంది..డాన్స్ నేపథ్యంలో వస్తున్నఈ సినిమా లో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తుండడం విశేషం.. ఇప్పటికే రిలీజ్ అయి రెండు టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రాగ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి..

కాగా, నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమా ఆడియో , రిలీజ్ డేట్ లను ప్రకటించారు. ఆగష్టు 12 న ఈ సినిమా ఆడియో రిలీజ్ అవుతుండగా, ఆగష్టు 24 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.. ఈ సినిమాలో కోవై సరళ, సల్మాన్ యూసఫ్ ఖాన్,చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు..

తారాగణం : ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దివ్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్.

More News

'సంతోషం' అవార్డుల క‌ర్టైన్ రైజ‌ర్ ఫంక్ష‌న్!

'సంతోషం' అవార్డుల పండుగ‌ షురూ అయింది. 16 సంవ‌త్స‌రాలు దిగ్విజ‌యంగా పూర్తిచేసుకుని 17వ ఏట‌లోకి అడుగు పెట్టేసింది.

ఆది పినిశెట్టి 'యూ టర్న్' ఫస్ట్ లుక్ విడుదల

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ' యూ టర్న్ '.. ఈ  సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయ్యింది..

'విశ్వరూపం 2' చిత్రం ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేసేలా ఉంటుంది - కమల్‌ హాసన్‌

యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తూ, దర్శకత్వం వహిరచిన చిత్రం 'విశ్వరూపం' సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే.

అభిమానుల ఆధ్వర్యంలో భరత్ అనే నేను వంద రోజుల వేడుక 

రాజమండ్రి అశోక దియేటర్ లో నగర సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అభిమానుల ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను వంద రోజుల వేడుకలు ఘనంగా నిర్వహించారు .

'గూఢచారి' ప్రీరిలీజ్ ఈవెంట్

అడివిశేష్‌, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్టా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో..