తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత.. కేబినెట్ నిర్ణయం!

  • IndiaGlitz, [Saturday,June 19 2021]

తెలంగాణలో లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ లాక్ డౌన్ ఎత్తివేతకు ఆమోదం తెలిపింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కరోనా అదుపులోకి వచ్చినట్లు వైద్య శాఖ ప్రభుత్వ నివేదికలో పేర్కొంది.

ఇదీ చదవండి: పవన్, రానా మూవీ క్రేజీ అప్డేట్.. ఇక పోలీస్ స్టేషన్ లో..

దీనితో ఇక లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనితో లాక్ డౌన్ లో విధించిన అన్ని నిబంధనల్ని ప్రభుత్వం ఎత్తివేయనుంది. కరోనా సెకండ్ వేవ్ ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. దీనితో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

నెమ్మదిగా పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తున్నారు. అయితే తెలంగాణ కేబినెట్ అంతర రాష్ట్ర బస్సు సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండగా థర్డ్ వేవ్ పై వైద్య నిపుణుల్లో ఆందోనళ నెలకొంది. కరోనా వేరియంట్లుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది.