నిమ్మగడ్డకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు?

  • IndiaGlitz, [Saturday,November 21 2020]

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. ఏపీలో రెండు వ్యవస్థల మధ్య జరుగుతున్న యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో ఎవరూ తగ్గడం లేదు. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వానికి ససేమిరా ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఏ విషయంలోనూ సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా వైసీపీ మంత్రులు నిమ్మగడ్డపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు.

సీఎం జగన్ కూడా నిమ్మగడ్డపై కోపంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కట్టడి చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇటీవల కోవిడ్ ప్రభావం కాస్త తగ్గిందని.. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి కాబట్టి ఫిబ్రవరిలో ఏపీలో సైతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. అప్పటి నుంచి రగడ స్టార్ట్ అయింది. ఆయన వీడియో కాన్ఫరెన్స్ పెట్టబోతే ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సీఎస్ వరకూ ఎవరూ సహకరించలేదు. పైగా మంత్రులు నోటికి పని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలోనే నిమ్మగడ్డకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. మార్చిలో ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఏపీలో ఏం జరుగుతోంది? అధికారులు ఎవరు సహకరించడం లేదు? ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు? ఆర్డినెన్స్‌లో పొందుపరిచిన అంశాలేంటి?

ఇప్పుడు హైకోర్టు ఆదేశాల తర్వాత నిమ్మగడ్డపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారెవరు? సహకరించని అధికారులు.. లేఖలు రాసినా స్పందించని అధికారులు ఎవరు? తదితర విషయాలపై సీఈసీ.. నిమ్మగడ్డతో చర్చించనున్నట్టు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ రావాలని నిమ్మగడ్డకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

More News

బాలయ్య 106లో .. హీరోయిన్‌ ఛేంజ్‌

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అంటే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పెద్ద ఛాలెంజ్‌, ఆయ‌న‌కు స‌రైన జోడీని ఫిక్స్ చేయ‌డ‌మే.

‘లూసిఫ‌ర్’ రేసులో మ‌రో డైరెక్ట‌ర్‌..?

మ‌లయాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ‘లూసిఫ‌ర్’ చిత్రాన్ని ఏ ముహూర్తాన రీమేక్ చేయాల‌ని చిరంజీవి నిర్ణ‌యించుకున్నారో ఏమో కానీ..

అక్క ఇచ్చిన బూస్ట్‌ని బాగా వంట పట్టించుకున్న మోనాల్..

ఓపెనింగే.. జున్ను ఎంట్రీ.. కొడుకును చూసి లాస్య ఆనందంతో పొంగిపోయింది. లాస్య భర్త మంజునాథ్ ఆమెకు చాలా ధైర్యం చెప్పారు.

టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల..

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లను నేడు తుది గడువు కావడంతో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేసింది.

రహస్య వివాహం చేసుకున్న ప్రభుదేవా...?

యాక్టర్‌, కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ అయిన ప్రభుదేవా పెళ్లి అయిపోయిందా? అంటే అవుననే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.