పవ‌న్ ని అలా చూడ‌గ‌ల‌రా?

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రికైనా ఠ‌క్కున‌ గుర్తుకొచ్చే చిత్రాలు.. సుస్వాగతం, తొలి ప్రేమ‌, త‌మ్ముడు, బద్రి, ఖుషి. ఈ ఐదు సినిమాలూ అత‌ని కెరీర్ ద‌శ‌ని, దిశ‌ని మార్చేసాయి. ఈ సినిమాల‌న్నింటిలోనూ ఉన్న కామ‌న్ పాయింట్‌.. ప్రేమ‌క‌థ‌లు కావ‌డం. ఈ చిత్రాల త‌రువాత ప‌వ‌న్ కెరీర్‌లో హిట్స్ ఉన్నా.. అవి ల‌వ్‌స్టోరీలైతే కాదు. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ప్రేమ‌క‌థ‌ని చేసేందుకు ప‌వ‌న్ సిద్ధ‌మ‌వుతుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.

అదే 'ఖుషి' ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య‌తో చేయ‌నున్న కొత్త చిత్రం. ఫ్యాక్ష‌నిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ ప్రేమ‌క‌థ ఉంటుంద‌ని ప‌వ‌న్ స్వ‌యంగా చెప్ప‌డం విశేషం. ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఫ్యాక్ష‌న్ చిత్రాల‌కు ఎప్పుడో కాలం చెల్లింద‌ని. ఆ త‌ర‌హా సినిమాలు చూసి చూసి ప్రేక్ష‌కులు విసుగు చెందిపోయారు. ఈ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థ‌ల వ‌య‌సుని దాటిపోయిన ప‌వ‌న్ మ‌ళ్లీ ప్రేమ‌క‌థ చేయ‌డం.. అదీ ఫ్యాక్ష‌నిజం నేప‌థ్యం అంటే 40 ప్ల‌స్‌లో ప‌వ‌న్‌ని అలా చూడ‌గ‌ల‌రా అని సినీ విశ్లేష‌కులు అనుమానాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?.

More News

శ్రుతిది మ‌ళ్లీ అదే తంతు

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది శ్రుతి హాస‌న్‌. 'ఎవ‌డు', 'రేసు గుర్రం', 'శ్రీమంతుడు'.. ఇలా పెద్ద హీరోల‌తో శ్రుతి హీరోయిన్‌గా చేసిన మూడు వ‌రుస సినిమాలు ఆమెకు విజ‌యాన్ని అందించాయి.

రైట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అ ఆ టీజ‌ర్ రిలీజ్..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అ ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనంద‌విహారి అనేది ట్యాగ్ లైన్.  ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

నాగశౌర్య అవుట్...

ప్రస్తుతం యంగ్ హీరోస్ లో నాగశౌర్యకు మంచి క్రేజ్ ఉంది. అయితే నాగశౌర్య ఆ క్రేజ్ ను సక్సెస్ రూపంలో మలుచుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ వైభోగమే సినిమా మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది.

12 ఏళ్ల తరువాత మహేష్

మొత్తానికి మహేష్ బాబు కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం' మే నెలలోనే విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.