close
Choose your channels

‘వకీల్ సాబ్’ సినిమాపై కేసు..

Wednesday, May 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘వకీల్ సాబ్’ సినిమాపై కేసు..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల పాటు గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం పవన్‌కు మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమా ఒక వ్యక్తికి లేని పోని తలనొప్పులు తెచ్చిపెట్టింది. సినిమాలో అంజలిని అభాసుపాలు చేసేందుకు రౌడీలు ఆమె పరువును నెట్టింట్లో పెట్టేస్తారు. అసభ్యకరమైన ఫోటోలు పెట్టి.. ఈ అమ్మాయి కావాలంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండని చెబుతూ అంజలి పరువు తీసేస్తారు. దీంతో ఆమె ఉద్యోగం కూడా ఊడిపోతుంది.

Also Read: ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమైన ‘కేజీఎఫ్’ బ్యూటీ

ఇప్పుడు ఆ సీన్ ఓ వ్యక్తికి వేధింపులు ఎదురయ్యేలా చేసింది. ఆ సీన్‌లో వాడిన ఫోన్ నంబర్ తనదేనని.. తనకు చెప్పా పెట్టకుండా వాడేసుకున్నారని, ఇప్పుడు దాని వల్ల తనకు లేని పోని తలనొప్పులు మొదలయ్యాయని సదరు వ్యక్తి వాపోతున్నాడు. అమ్మాయిలు కావాలంటూ తనకు కొందరు ఆకతాయిలు పదే పదే ఫోన్లు చేస్తున్నారని వాపోయాడు. ఇక ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘వకీల్ సాబ్’ చిత్రంలో తన ఫోన్‌ నంబర్‌ను వాడుకున్నారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన అనుమతి లేకుండానే వకీల్‌ సాబ్‌లో ఓ చోట తన ఫోన్‌ నంబర్‌ను స్క్రీన్‌ మీద చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వకీల్ సాబ్ నిర్మాతకు సైతం సుధాకర్ ఇదే విషయమై లీగల్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే నిర్మాత దిల్ రాజు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.. ఇలాంటి ఘటనలు గతంలో కూడా పలు మార్లు జరిగాయి. సినిమాలో కొన్ని ఫోన్ నంబర్లు చెప్పే సీన్ల వల్ల ఎంతో మంది ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాజాగా ‘వకీల్ సాబ్’ విషయంలో కూడా తప్పిదం జరిగిపోయింది. మొత్తానికి ఇప్పుడు ఈ వ్యవహారంతో ‘వకీల్ సాబ్’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మరి దర్శకనిర్మాతలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.