Dimple Hayati:ఐపీఎస్‌ కారును ఢీకొట్టి, కాలితో తన్ని : ప్రతిరోజూ ఇదే గొడవ .. హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు

  • IndiaGlitz, [Tuesday,May 23 2023]

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కారును ఉద్ధేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు ధ్వంసం చేసిందన్న అభియోగాలపై ఆమెపై హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో వున్న ఎస్‌ఆర్‌‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం వుంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి వుంటున్నారు. అయితే రాహుల్ కారు పార్క్ చేసే స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును నిలిపివుంచేవారు. దీంతో పాటు డీసీపీతో పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు . రాహుల్ అధికారిక వాహనానికి వున్న కవర్‌ను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించడం, కారుకి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటివి చేశారు. దీనిపై రాహుల్ హెగ్డే పలుమార్లు మందలించినప్పటికీ.. వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఎన్నిసార్లు నచ్చజెప్పినా తీరు మార్చుకోని డింపుల్ :

ఇదే సమయంలో మే 14న రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టడంతో పాటు కాలితో తన్నుతూ వీరంగం సృష్టించారు డింపుల్, డేవిడ్. దీనిపై ప్రశ్నించిన రాహుల్ హెగ్డే డ్రైవర్‌తోనూ ఆమె గొడవకు దిగింది. దీంతో డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు డింపుల్, డేవిడ్‌లపై ఐపీసీ సెక్షణ్ 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. సోమవారం వీరిద్దరిని అదుపులోకి తీసుకుని.. 41 (ఏ) కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

More News

Vimanam:‘విమానం’ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ‘సుమతి’ విడుదల.. జూన్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్

‘‘సుమ‌తీ.. సుమ‌తి నీ న‌డుములోని మ‌డ‌త

Ram Charan:జీ 20 వేదికపై 'నాటు నాటు' సాంగ్ .. ప్రతినిధులతో కలిసి డ్యాన్స్ చేసిన రామ్ చరణ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటించిన చిత్రం ‘‘ఆర్ఆర్ఆర్’’. ఈ సినిమాలోని ‘నాటు నాటు’కు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో

Globalstar Ram Charan:భారతదేశం, భారతీయ సినిమా సత్తా ఇది   : జీ 20 సదస్సులో రామ్ చరణ్ అద్భుత ప్రసంగం

చిరుత చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Ray Stevenson:ఆర్ఆర్ఆర్ విలన్ రే స్టీవెన్సన్ హఠాన్మరణం.. షాక్‌లో చిత్ర పరిశ్రమ, ఆర్ఆర్ఆర్ యూనిట్ సంతాపం

సంగీత దర్శకుడు రాజ్, దిగ్గజ నటుడు శరత్ బాబు మరణాల నుంచి కోలుకోకముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

Shaktikanta Das:రూ.1000 నోటును తిరిగి ప్రవేశపెట్టేది లేదు.. రూ.2 వేల నోటు డిపాజిట్లపై నిబంధనలివే : ఆర్‌బీఐ గవర్నర్

రూ.2000 నోటును ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.