ప్రముఖ నిర్మాణ సంష్ట ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ కాస్టింగ్ కాల్

  • IndiaGlitz, [Thursday,August 30 2018]

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 3వ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కోసం 23 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసులో వుండే అబ్బాయి, 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసులో వుండే అమ్మాయి కోసం ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్టు చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. అలాగే ఈ చిత్రం లో 12 నెలల పాప పాత్ర కీలకమైంది. ఈ పాత్రను కూడా ఆడిషన్ ద్వారానే ఎంపిక చేయనున్నారు. అల్ట్రా మోడ్రన్ లవ్ స్టొరీ కావడం వల్లే కొత్త వారితో సినిమా చేయనున్నట్లు నిర్మాత తెలిపారు...

ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ... ఎస్ ఆర్ టి బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా విద్యా సాగర్ దర్శకత్వంలో కొత్త వారితో సినిమా ప్రారంభిస్తున్నాం. హీరో, హీరోయిన్ తో పాటు 12 నెలల పాపను కూడా ఆడిషన్స్ నిర్వహించి ఎంపిక చేయనున్నాం. ఈ న్యూ ఏజ్ అల్ట్రా మోడ్రన్ రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించాలనుకునే వారు తమ రీసెంట్ పోర్ట్ ఫోలియో, డాన్స్ వీడియో ( ఒక నిమిషం), యాక్టింగ్ వీడియో (ఒక నిమిషం) auditions.srtentertainments@gmail.com పంపించండి.

ఈ వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా ఆడిషన్స్ కి సెలెక్ట్ చేస్తాం. మేము నిర్వహించే ఆడిషన్స్ ద్వారా హీరో హీరోయిన్ ని ఎంపిక చేస్తాం. మరోవైపు ఎస్ ఆర్ టి బ్యానర్ లో రవితేజ హీరోగా... వి ఐ. ఆనంద్ దర్శకత్వంలో సినిమా రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలతో అధికారికంగా ప్రకటిస్తాం. అని అన్నారు

More News

విజయదశమి కానుకగా విశాల్‌ 'పందెం కోడి 2'

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'.

శ్రీ హరికృష్ణ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది - డా:టి.సుబ్బరామి రెడ్డి

మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను.

ద‌ర్శ‌కుడి విష‌యంలో మ‌రోసారి కంగ‌నా క్లారిటీ

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట‌య్యింది. సినిమా అంతా పూర్త‌య్యింది.

అఫీషియ‌ల్‌... వెన‌క్కి వెళ్లిన సూర్య‌

తమిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న త‌మిళ హీరో సూర్య‌. ఆయ‌న హీరోగా  ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఘనంగా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'..