చిరు మూవీలో క్యాథరిన్ ఔట్..రాయ్ ఇన్

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా, ప్రెస్టిజియ‌స్ 150 మూవీ 'ఖైదీ నంబ‌ర్ 150'. చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై రాంచ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త‌మిళ చిత్రం క‌త్తి కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో త‌రుణ్ అరోరా విల‌న్‌గా న‌టిస్తుంటే కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాలో క్యాథ‌రిన్ థెస్రా ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. యూనిట్ వ‌ర్గాలు కూడా ఖ‌రారు చేశాయి. అయితే ఏమైంతో ఏమో కానీ ఇప్పుడు లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో క్యాథ‌రిన్ ప్లేస్‌లో ల‌క్ష్మీరాయ్ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ట‌. మ‌రి క్యాథరిన్ స్పెష‌ల్ సాంగ్ ఎందుకు చేయ‌లేద‌నే దానిపై ఎటువంటి స‌మాచారం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌లో స్పెష‌ల్ సాంగ్ చేసిన ల‌క్ష్మీరాయ్ ఇప్పుడు అన్న‌య్య చిరంజీవితో కాలు క‌దప‌నుంది.

More News

సిద్ధార్థ డైరెక్ట‌ర్‌తో నాని

సిద్దార్థ‌, శృతిహాస‌న్‌, హ‌న్సిక‌ల‌తో రూపొందిన సినిమా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. వేణు శ్రీరాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించాడు.

బాలీవుడ్ రీమేక్‌లో త్రిష‌

త్రిష త‌మిళంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ధ‌నుష్ స‌ర‌స‌న కొడి(తెలుగులో ధ‌ర్మ‌యోగి) సినిమాలో నెగ‌టివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించింది.

ర‌కుల్ త‌ప్పుకుంది

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకెళుతుంది. ఇప్పుడు త‌మిళంలో కూడా అడుగుపెట్టింది. విశాల్ హీరోగా మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తుప్ప‌రివాల‌న్ చిత్రంలో ముందుగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఎన్టీఆర్ - పూరి మూవీ ఎనౌన్స్ మెంట్ ముహుర్తం ఫిక్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో ఆంధ్రావాలా, టెంప‌ర్ చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. అయితే... వీరిద్ద‌రూ క‌లిసి మూడవ సినిమా త్వ‌ర‌లో చేయ‌నున్నార‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అఖిల్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

అక్కినేని అఖిల్ త‌న‌ రెండో సినిమాను మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు నాగార్జున ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే.