close
Choose your channels

నిఖిల్ కి జోడీగా కేథరిన్

Tuesday, January 9, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విభిన్న పాత్రలను చేయడానికి ముందుండే క‌థానాయ‌కుల‌లో యంగ్ హీరో నిఖిల్ ఒక‌రు. ప్రస్తుతం ఈ హీరో నటించిన కిర్రాక్ పార్టీ` సినిమా ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది. కన్నడంలో విజయం సాధించిన కిరిక్ పార్టీ` సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో నిఖిల్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రో రీమేక్‌కి కూడా నిఖిల్ తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

2016లో విడుద‌లై తమిళంలో ఘన విజయం సాధించిన థ్రిల్లర్ ఫిలిం కణితన్`ని.. తెలుగులో రీమేక్ చేయ‌డానికి చాన్నాళ్లుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు ఆ రీమేక్‌లో న‌టించ‌డానికి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఈ మూవీ తెలుగు హక్కుల్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారు. తమిళ్ లో కథానాయికగా నటించిన కేథరిన్‌నే తెలుగులో కూడా నటించనుంద‌ని తెలిసింది. అలాగే తమిళ్ వెర్షన్ని డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మార్చి నుంచి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నున్న‌ ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను నిర్మాత త్వరలోనే వెల్లడిస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.