'గౌతమ్ నంద' కోసం సొంత డబ్బింగ్ చెప్పుకొన్న కేతరీన్

  • IndiaGlitz, [Tuesday,May 09 2017]

మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కేతరీన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంటుండడం విశేషం.
ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. "కేతరన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పు క్యారెక్టరైజేషన్ ను ప్రాణం పోసింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆమెను చూస్తే ఫ్రెషర్ అనిపించలేదు" అన్నారు.
చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాత్రాడుతూ.. "గౌతమ్ నంద పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాకీ పార్ట్ పూర్తయ్యింది. కేతరీన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ప్రశంసార్హం. రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా "గౌతమ్ నంద" నిలుస్తుంది. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం" అన్నారు.
హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

More News

'కల్పన-3' ఆడియో విడుదల

సాయివెంకట్ సమర్పణలో భీమవరం టాకీస్ బ్యానర్పై ఉపేంద్ర, ప్రియమణి, తులసి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `కల్పన-3`. ఉదయ్రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు.

'అంధగాడు' పాటల సందడి షురూ...

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ లో

స్కాం సొమ్ముతోనే సినిమా

గతంలో కృత్తిమ గర్భధారణం అనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా 'అమ్మా నీకు వందనం'.

కిడ్నాప్ చేయలేందటున్న బుల్లితెర నటుడు...

బుల్లితెర నెంబర్ వన్ షోగా సాగుతున్న జబర్ దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పరిచయమవుతున్నారు.

పీటర్ హెయిన్స్ దర్శకత్వం...

సౌతిండియా స్టార్ యాక్షన్ కంపోజర్ పీటర్ హెయిన్స్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు.