ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు

  • IndiaGlitz, [Friday,March 26 2021]

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎస్‌బీఐ చెన్నై బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు ఆయనపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఇంద్‌ భారత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం రఘురామకృష్ణంరాజు ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులను మోసం చేశారని.. 273.84 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి నిధులను దారి మళ్లించినట్టు మేనేజర్‌ రవిచంద్రన్‌ వెల్లడించారు. ఈ నెల 23న సీబీఐకి ఫిర్యాదు చేశారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండ్ భారత్ పవర్ జెన్‌కమ్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్ రఘు రామకృష్ణ రాజు, ఇతర డైరెక్టర్లు కనుమూరు రమాదేవి, రాజ్ కుమార్ గంటా, దుంపల మధు సూదన రెడ్డి, నారాయణ ప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్‌లపై కేసు నమోదైంది. ఐపీసీలోని 120 బీ రెడ్‌విత్ 420, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(డీ) కింది అభియోగాలు మోపింది.

నిందితులంతా కుమ్మక్కై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, ఫోర్జరీ పత్రాలను అసలైనవిగా చూపించటం తదితర నేరాలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రవిచంద్రన్ ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో ఈ మోసం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో తాము గుర్తించామని రవిచంద్రన్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీబీఐ వెల్లడించింది. నకిలీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు, ఊహాజనిత లావాదేవీలను సృష్టించడం ద్వారా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కుట్రపూరితంగానే దారి మళ్లించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

More News

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. స్పందించిన చిరు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు పెట్టిన విషయం తెలిసిందే. నేడు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు.

న‌న్ను మించి 'రంగ్ దే' క‌థ‌ను నితిన్‌, కీర్తి సురేష్ ఎక్కువ‌గా న‌మ్మారు - డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి

'తొలిప్రేమ'‌, 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూడో చిత్రం 'రంగ్ దే'.

డా. రాజశేఖర్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో 'మర్మాణువు'

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 50 వేల ఖాళీల భర్తీ

ఎమ్మెల్యేలు, మాజీ శానస సభ్యులకు సంబధించిన పెన్షన్ బిల్లు సవరణను ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టగా..

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు: జగన్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఒకప్పుడు మారుమోగిన ఈ పేరు.. ఆ తరువాతి కాలంలో ఈ పేరు మరుగున పడిపోయింది.