కోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురు!

సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి చుక్కెదురైంది. తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయమై ప్రతి శుక్రవారం వైఎస్ జగన్.. అమరావతి నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వచ్చి హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీబీఐ, ఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్లపై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. అయితే ఈ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టి వేసింది. అంతేకాదు.. ఆయా కేసుల్లో జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఈడీ కేసులో ఇకనుంచి జగన్ కోర్టుకు హాజరుకాక తప్పనిపరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే.. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు ఈడీ అధికారులు నిశితంగా వివరించారు. ఇదివరకు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్.. ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని అలాంటి వ్యక్తికి మినహాయింపు ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాదులు.. కోర్టుకు దృష్టికి రావడంతో.. జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. దీంతో జగన్‌కు మరోసారి చుక్కెదురైనట్లయ్యింది. సో.. ఇకపై కూడా ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కేసులతో పాటు.. ఈడీ కేసులకు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న మాట.

More News

ఇదే జరిగితే ‘ఈనాడు రామోజీరావు’ జైలుకే..!?

అవును మీరు వింటున్నది నిజమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించిందో.. ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావు జైలుపాలవ్వక తప్పదని..

అల్లు అర్జున్ మూవీ ఎఫెక్ట్.. కవలలు ఏం చేశారో చూడండి!

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, హన్సిక నటీనటులుగా వచ్చిన చిత్రం ‘దేశముదురు’. అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది.

పెళ్లిపై త్రిష ఇంత మాట అనేసిందేంటి!?

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన చెన్నై పొన్ను, దక్షిణాది స్లిమ్ బ్యూటీ త్రిషను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు.

సెన్సార్ కోసం ఎదురు చూస్తున్న 'శివ 143'

సంక్రాంతి కి విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేసాం కానీ సెన్సార్ వారు చూడని కారణము గా సంక్రాంతి కి విడుదల చేయలేక పోయాం.

ఆ కోరికను ‘వాళ్లిద్దరి మధ్య’ తీర్చింది: వి.ఎన్. ఆదిత్య

తొలి చూపు... తొలి వలపు- ఈ  రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం మూమూలుదికాదు. ఆ రెండిటికీ మధ్య  ఓ తలుపు  కూడా ఉంటే దాని వెనుక కూడా పెద్ద  కథే ఉంటుంది...