అయేషా మీరా హత్యకేసులో సీబీఐ దూకుడు.. రీ పోస్టుమార్టమ్!

  • IndiaGlitz, [Saturday,July 13 2019]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. అయేషా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. అయితే మృతదేహాన్ని పూడ్చిపెట్టి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎముకలకు పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని సీబీఐ అభిప్రాయపడుతోంది.

మరోవైపు.. ఆయేషా తల్లి షంషాద్ బేగంను ఈ పోస్టుమార్టం విషయమై సీబీఐ సంప్రదించింది. ఇందుకు స్పందించిన షంషాద్.. న్యాయం జరుగుతుందంటే మళ్లీ పోస్ట్ మార్టం చేయడానికి అభ్యంతరం లేదని శంషాద్ బేగం, ఆమె తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. అయితే మళ్లీ పోస్ట్ మార్టం నిర్వహిస్తే ముస్లిం పెద్దల నుంచి వ్యతిరేఖత లేకుండా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని సీబీఐ నిర్ణయించింది. ఈ పోస్టుమార్టంలో ఏం తేలుతుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More News

'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే..!!

వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ సెటైర్లు వేశారు.

యశ్ ముఖ్య అతిథిగా బెంగళూరులో 'డియ‌ర్ కామ్రేడ్' మ్యూజిక్‌ ఫెస్టివ‌ల్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. ఈ చిత్రంతో ద‌క్షిణాదిన స‌త్తా చాట‌డానికి సిద్ధ‌మ‌య్యారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

అనుదీప్ 'శివ‌శంక‌రీ' ఫ్యూజ‌న్ కవ‌ర్  సాంగ్ లాంచ్‌!!

టాలీవుడ్ లో టాలెంటెడ్ సింగ‌ర్ గా పేరు తెచ్చుకున్న అనుదీప్ చేసిన  `శివ‌శంక‌రీ` ఫ్యూజ‌న్ క‌వ‌ర్ సాంగ్ లాంచ్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో

ఎట్టకేలకు నామినేటెడ్ పదవి దక్కించుకున్న రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆమె ఎంత బాధపడిందో తెలియదు గానీ.. ఆమె అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు.

ప్రముఖ రచయిత పురాణపండ మహత్తర గ్రంథానికి భారీ డిమాండ్

ఈ ప్రపంచంలో హనుమంతుడు లేని ప్రదేశం లేదు. కదిలే ప్రతి కణంలో, సాగే ప్రతిక్షణంలో, ప్రసరించే ప్ర కిరణంలో, ప్రచరించే ప్రతి ప్రాణంలో ఆంజనేయ భగవానుని లాలిత్యం వ్యక్తమవుతూనే ఉంటుంది.