Jagan:జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దన్న సీబీఐ.. తీర్పు వాయిదా..

  • IndiaGlitz, [Thursday,May 09 2024]

లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్(CM Jagan)నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ లండన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని అందులో కోరారు. ఇప్పటికే జగన్‌పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని వెల్లడింరచారు. ప్రతి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారని.. మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని వాదించారు.

అయితే దీనిపై జగన్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. జగన్ గతంలోనూ అనేకసార్లు విదేశాలకు వెళ్లారని.. ఎక్కడా కోర్టు నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. రైట్ టూ ట్రావెల్స్ అబ్రాడ్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని.. ఆ హక్కును కాలరాయడం సరికాదని పేర్కొన్నారు. అందుచేత ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 14కు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. తొలుత కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లోని జెరూసలెం పర్యటనకు వెళ్లారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్లారు. తర్వాత ఫ్యామిలీతో పాటు దావోస్ వెళ్లారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొని .. అటు నుంచి విహారయాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. గతేడాది మరోసారి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్‌లో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు.

కాగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ షరతుల్లో భాగంగా పాస్ పోర్టును కోర్టుకు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకుని.. కోర్టు దగ్గర ఉన్న పాస్ పోర్టు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల అధినేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న పోలింగ్ ముగిసిపోతుంది. కౌంటింగ్ జూన్ 4న జరుగుతుంది. దీంతో మధ్యలో 20 రోజుల వరకూ సమయం ఉంది. అందుకే గత నెలన్నర రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జగన్.. కుటుంబంతో గడపాలని భావించారు. జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్‌లో చదువుకుంటున్నారు.

More News

PM Modi: వైసీపీ కౌంట్‌డౌన్‌ మొదలైంది.. పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తాం: మోదీ

ఏపీలో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని..

CM Jagan:క్రేజ్ కా బాప్.. ఎన్నికల వేళ సంచలనంగా సీఎం జగన్ ఇంటర్వ్యూ..

సీఎం జగన్‌కు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు జగన్ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏపీ రాజకీయాల్లో

KTR:జైలుకు వెళ్లడానికి నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా

Gadde Rammohan: టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాట్సాప్ చాట్ లీక్.. మహిళలతో అసభ్యకరంగా..!

ఏపీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ ఓటు వేయాలని కోరుతున్నారు.

CM Jagan:విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి కోరిన సీఎం జగన్

ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల అధినేతలు విస్తృతంగా ప్రచారం