ఘనంగా వెంకయ్యనాయుడు మనవడి రిసెప్షన్


Send us your feedback to audioarticles@vaarta.com


మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో ఏర్పాటుచేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు. నూతన వధూవరులు యిమ్మణ్ణి విష్ణు, సాత్వికలను ఆశీర్వదించారు.
వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మార్గమధ్యంలో తనని కలవడానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి, కామినేని శ్రీనివాస్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments