మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ పథకం పొడిగింపు, ఎన్ని నెలలంటే

కరోనా కారణంగా మనదేశంలో ఎలాంటి పరిస్దితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీగా కేసులు, మరణాలు నమోదయ్యాయి. మధ్యలో వచ్చిన ఒమిక్రాన్ అంతగా భయపెట్టనప్పటికీ.. కొన్ని చోట్ల కఠినమైన ఆంక్షలు విధించడంతో ప్రజల ఆర్ధిక పరిస్ధితులు దిగజారాయి. ముఖ్యంగా నిరుపేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పీఎం గరీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శ‌నివారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి మండలి ఉచిత రేష‌న్‌ను మ‌రో ఆరు నెల‌ల పాటు పొడిగిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో ఈ ఏడాది సెప్టెంబ‌ర్ దాకా పేద‌ల‌కు ఉచిత రేష‌న్ అంద‌నుంది. ఈ ప‌థ‌కం కింద దేశంలోని 80 కోట్ల మందికి ల‌బ్ధి చేకూరనుంది.

కాగా.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉచిత రేషన్ పథకం కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. కరోనా సమయంలో యూపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. శనివారం మంత్రి మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం యోగి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఉఛిత రేషన్ పథకం’ను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో రాష్ట్రంలోని 15 కోట్ల పేదలకు ఉచిత రేషన్ అందనుందని అంచనా. సీఎం యోగి తీసుకున్న నిర్ణయంతో సుమారు 15 కోట్ల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని.. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ. 3 వేల 270 కోట్ల భారం పడుతుందని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. అయితే కేంద్రం ఈ ప‌థ‌కాన్ని ఆరు నెల‌ల పాటు పొడిగించ‌డంతో యూపీ ప్ర‌భుత్వంపై ఈ ప‌థ‌కం భారం ప‌డ‌దు.

More News

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడ్డ పెళ్లి బస్సు, 8 మంది దుర్మరణం .. మోడీ, జగన్ దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.

మొత్తానికి షాకిచ్చారుగా.. నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి నిశ్చితార్థం, ఫొటోలు వైరల్

టాలీవుడ్‌లో మరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఆయన ఎవరో కాదు. ఆది పినిశెట్టి.

వాళ్లందరికీ థ్యాంక్స్ : ఎట్టకేలకు బయటకొచ్చి గుడ్‌న్యూస్ , సాయితేజ్ వీడియో వైరల్

గతేడాది రోడ్డు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇంటికే పరిమితమైపోయారు మెగా హీరో సాయిధరమ్ తేజ్.

చరణ్‌ను చూసి గర్వపడుతున్నా.. మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్ : ఆర్ఆర్ఆర్‌పై అల్లు అర్జున్ రివ్యూ

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్‌చరణ్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం... భుజాలపై కూతురి మృతదేహాన్ని 10 కిలోమీటర్లు మోసుకుంటూ

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమంటూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, నేతలు ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తూ వుంటారు.