వచ్చే వారం కరోనా టీకాకు.. కేంద్రం అనుమతి!

  • IndiaGlitz, [Thursday,December 24 2020]

కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు పలు సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత్‌లో వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వస్తోంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద అనుమతులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాయిటర్స్ కథనం వెల్లడించింది. కాగా.. తయారీ సంస్థలన్నీ టీకాపై అధికారులు కోరిన అదనపు సమాచారాన్ని అందించాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం అనుమతులు మంజూరయ్యే అవకాశముందని తెలుస్తోంది.

భారత్ బయోటెక్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్, ఫైజర్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఫైజర్ టీకా ధర ఎక్కువగా ఉండటం.. భద్ర పరిచేందుకు సైతం ఇబ్బందికర పరిస్థితులుండటంతో ప్రభుత్వం ఈ టీకాను పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. కాగా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాతో కలిసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం.. ధర తక్కువ.. రవాణాకు అనుకూలం.. భద్రపరిచే అవకాశాలు సైతం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ టీకా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే టీకాను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. మరోవైపు బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ సహా పలు దేశాలు బ్రిటన్ నుంచి విమాన రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అది కొత్త వైరస్ రకమా.. కాదా? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే భారత్‌లోని పలు రాష్ట్రాలు అప్రమత్తమై నైట్ కర్ఫ్యూని విధిస్తున్నాయి.

More News

పరిస్థితుల్ని పాట రూపంలో చెప్పిన ఆదివాసీలు.. చలించిపోయిన పవన్

మూడేళ్ల అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త విరామమిచ్చి సినిమాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

అభిజీత్ కంటే ముందుగా..వెండితెర‌పైకి సోహైల్ ..!

బిగ్‌బాస్ 4లో అభిజీత్ విన్న‌ర్‌గా, అఖిల్ రన్న‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ మూడో స్థానంలో నిలిచిన సోహైల్ ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకున్నాడు.

మరో ప్రమాదకరమైన మహమ్మారి గుర్తింపు..

కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తుంటే అంతకంటే ప్రమాదకరమైన మరో రకం కరోనా వైరస్‌ను గుర్తించినట్టు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ బుధవారం వెల్లడించారు.

ఫంటాస్టిక్ తార’కు బ్రాండ్ అంబాసిడర్‌గా సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల ముద్దుల తనయ సితార ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కేసు వెన‌క్కి తీసుకున్న ఇళ‌య‌రాజా..!

చెన్నై ప్ర‌సాద్ స్టూడియో అధినేత‌ల‌పై పెట్టికేసుని వెన‌క్కి తీసుకున్నారు ఇసైజ్ఞాని ఇళ‌య‌రాజా .