కరోనా ఉధృతి.. కేంద్రం నూతన మార్గదర్శకాలివే..

  • IndiaGlitz, [Tuesday,March 23 2021]

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నిబంధనలు ఏప్రిల్ నెలాఖరు వరకూ కొనసాగుతాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ తప్పనిసరిగా పాటించాలని మరోమారు కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులకు సంబంధించి కూడా కేంద్రం పలు కీలక సూచనలు చేసింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను 70శాతానికి పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపింది.

కేంద్రం మార్గదర్శకాలు..

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు పెంచాలి. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్సను అందించాలి. ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేపట్టాలి.

పాజిటివ్ కేసులను బట్టి కంటోన్మెంట్‌ జోన్‌లను ప్రకటించాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో పొందుపరచాలి. కంటోన్మెంట్ జోన్‌లలో ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు చేయాలి.

బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు చేపట్టాలి. మాస్క్‌లు, సామాజిక దూరం పాటించేలా చూడాలి. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చు.

స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాతిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చు.

అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదు.

కంటోన్మెంట్ జోన్ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంది. అయితే ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్ సెంటర్లు తదితర వాటిల్లో నిర్దేశిత ప్రమాణాలు(ఎస్ఓపీలు) అమల్లో ఉంటాయి. వీటికి లోబడే కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. 

More News

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి!

పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తైంది.

ప్రభుత్వ పథకాలపై వ్యంగ్యాస్త్రాలు.. హాట్ టాపిక్‌గా ఈటల తీరు..

మంత్రి ఈటల రాజేందర్.. ఒక మంచి వ్యక్తిగా ఆయనకు పేరుంది. గులాబీ పార్టీలో ఓ మంచి స్థానంలో ఉన్న ఆయనకు ఈ మధ్య పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోతోంది.

రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కొద్ది నెలలుగా కరోనా విషయంలో ఇలాంటి వార్తలేమీ వినిపించలేదు.

రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా స్కూళ్లు తెరిచినప్పటి నుంచి కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ?

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది.