రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..

  • IndiaGlitz, [Friday,May 15 2020]

భారతదేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన కేంద్రం.. తాజాగా రైతుల కోసం అన్ని రకాల రైతులకు రూ.లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ చెప్పుకొచ్చారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆర్థిక మంత్రి.. వ్యవసాయ రంగ మౌలిక వసతుల కోసం రూ.లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతర్రాష్ట్ర వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తామని, రైతులు ఏ రాష్ట్రంలోనైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే తమ ఉత్పత్తులు విక్రయించుకోవచ్చని, అలాగే తమకు అనుకూల ధరకు కొనుగోళ్లు కూడా జరపవచ్చని ఈ మేరకు జాతీయస్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఆర్థిక మంత్రి రైతన్నలకు భరోసా ఇచ్చారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకే విక్రయించాల్సిన అవసరం ఇక మీదట ఉండదని.. వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై పరిమితులు తొలగిస్తున్నామని కేంద్రం మంత్రి స్పష్టం చేశారు.

కేటాయింపులు ఇవీ..

‘ వ్యవసాయ రంగ మౌళిక సదుపాయాల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు ప్రకటిస్తున్నాం. ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు రూ. 10వేల కోట్లు కేటాయిస్తున్నాం. దేశ వ్యాప్తంగా 2 లక్షల వరకు ఉన్న సూక్ష్మ, చిన్న సంస్థలకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాం. మత్స్యసంపద యోజనకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఫిషింగ్ హార్బర్, కోల్డ్ స్టోరేజ్‌లు, మార్కెట్ల కోసం రూ. 9 వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నాం. తేనె, పట్టు పరివ్రమ కోసం రూ. 500 కోట్లు కేటాయింపు. ఔషధ మొక్కల పెంపకానికి రూ. 4 వేల కోట్లు. కోల్డ్ స్టోరేజీల్లో ఆరు నెలలపాటు నిల్వ ఉంచుకున్నా రవాణాలో రాయితీ ఉంటుంది. మత్స్య, డెయిరీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ కోసం 11 అంశాల్లో రాయితీలు ఉంటాయి. పీఎం ఫసల్ బీమా పథకం కింద రూ. 6400 కోట్ల పరిహారం ఇచ్చాం. పీఎం కిసాన్ సమ్మాన్ కింద 74,300 కోట్ల మేర పంటన్ని కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేశాం. లాక్ డౌన్ సమయంలో పాల డిమాండ్ 20-25 శాతం తగ్గింది. లాక్ డౌన్ వల్ల ఏర్పడిన మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించాం. పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం. 2 కోట్ల మంది పాడి రైతులకు రూ. 5వేల కోట్ల మేర ప్రోత్సాహం అందించాం. సహకార సంగంలోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ ఇచ్చాం. గడువు తీరిన 242 ఆక్వా హేచరీస్‌లకు రిజిస్ట్రేషన్ గడువు 3 నెలలు పొడిగిస్తున్నాం. స్థానికంగా ఉన్న ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉంది. తెలంగాణ పసుపుకు, ఏపీ మిర్చికి అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ఉంది. దేశ వ్యాప్తంగా 2 లక్షల వరకు ఉన్న సూక్ష్మ, చిన్న సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యక్తిగత బోట్లు, మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తాం’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు.

More News

డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య

అన‌సూయ‌ను అభినందించిన పోలీసులు

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌తో పాపులారిటీ సంపాదించుకున్న యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టిన‌రోజు నేడు(మే 15). ఈ సంద‌ర్భంగా అన‌సూయ కీస‌ర మండ‌లంలోని ప‌లువురు గ‌ర్భిణీల‌కు న్యూటిష‌న్ కిట్ల‌ను పంపిణీ చేశారు.

బాలీవుడ్ విల‌న్‌తో బాల‌కృష్ణ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం

వ‌రుస సినిమాలు ప్లాన్ చేస్తున్న మంచు విష్ణు

మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడైన మంచు విష్ణు ఆచార్య అమెరికా యాత్ర త‌ర్వాత ఏడాదికిపైగానే సినిమా చేయ‌లేదు. గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు.

స‌హ‌జీవ‌నాన్ని కన్‌ఫర్మ్ చేసిన గోపీసుందర్

జాతీయ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ గోపీ సుంద‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. ఈయ‌న త‌న భార్య ప్రియ నుండి విడిపోతున్నాడ‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి.