కేంద్రం సంచలన నిర్ణయం.. ఇవన్నీ ఇక ప్రైవేట్‌కే..!?

  • IndiaGlitz, [Saturday,May 16 2020]

కరోనా మహమ్మారి దెబ్బతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. అసలు ఈ లోటు నుంచి ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకోబోతోంది. ఈ మేరకు దేశంలో వేలం ద్వారా ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అదే విధంగా దేశంలో 12 ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేటు పెట్టుబడుల శాతం పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని డిస్కమ్‌లు కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. వాణిజ్య విధానానికి అనుగుణంగా బొగ్గు గనుల్లో కొత్త సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

రక్షణ, అంతరిక్షం కూడా!

ఇదిలా ఉంటే.. అత్యంత కీలకమైన రక్షణరంగంలో 49శాతం నుంచి 74శాతం వరకు ఎఫ్‌డీఐలు ఇవ్వాలని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆస్పత్రులు, విద్యా సంస్థల ఏర్పాటులో కూడా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పాత్ర ఉండాలని కేంద్రం భావిస్తోంది. అంతరిక్ష రంగంలో ఇస్రోతో పాటు ప్రైవేటు సంస్థలకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రీసెర్చ్‌ అణురియాక్టర్లు తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రటన ఎప్పుడు వస్తుందో..? ప్రైవేట్‌మయం చేయాలనుకుంటున్న కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.

More News

డిసెంబ‌ర్‌లో నితిన్ పెళ్లి..?

ప్ర‌స్తుతం క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఏర్ప‌డించి జ‌నాలు ప‌దిమందికి పైగా ఎక్క‌డైనా గుమిగూడాలంటే ప్ర‌భుత్వాలు ఒప్పుకోవ‌డం లేదు. అయితే అంతకు ముందే పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్న టాలీవుడ్ సెల‌బ్రిటీలు

అనుష్క 'నిశ్శబ్దం', 'ఉప్పెన‌' ఓటీటీలోనేనా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి

అగ్ర నిర్మాణ సంస్థ సినిమాలో సమంత..?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది.

సితార కోసం మ‌హేశ్ పాట‌!!

క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల నెల‌కున్న లాక్‌డౌన్ కార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో వారి విలువైన స‌మ‌యాన్ని గడుపుతున్నారు.

కష్టకాలంలో మంచి మనసు చాటుకున్న 'స్టార్ మా'

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ నడుస్తు్న్న విషయం విదితమే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.