క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసంటున్న కేంద్ర‌మంత్రి..!

  • IndiaGlitz, [Tuesday,November 29 2016]

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇక‌ క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చెప్పాడు అనేది కూడా అదే స్ధాయిలో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి స‌మాధానం ఏమిటి అని రాజ‌మౌళిని అడిగితే...బాహుబ‌లి 2 వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే అనేవారు త‌ప్ప స‌మాధానం చెప్పేవారు కాదు.

ఇదిలా ఉంటే...గోవాలో జ‌రుగుతున్న 47వ అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వంకు రాజ‌మౌళి ముఖ్య అతిధిగా హాజ‌రయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ స‌హాయ మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ కూడా హాజ‌రయ్యారు. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అని రాజ‌మౌళిని కేంద్ర‌మంత్రి రాథోడ్ అడ‌గా అస‌లు విష‌యం చెప్పేసార‌ట‌. ఈ విష‌యాన్ని కేంద్ర‌మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ వేదిక పై చెబుతూ....క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో నాకు తెలుసు. రాజ‌మౌళి చెప్పిన ఆ ర‌హాస్యం నా ద‌గ్గ‌ర భ‌ద్రంగా ఉంటుంది.నాకు ఆ ర‌హాస్యాన్ని చెప్పిన రాజ‌మౌళికి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

More News

ఎన్టీఆర్ - బాబీ మూవీకి అడ్డుగా అభిషేక్ బ‌చ్చ‌న్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై చాలా మంది డైరెక్ట‌ర్స్ పేర్లు తెర పైకి వ‌చ్చాయి. ఫైన‌ల్ గా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ బాబీ ని క‌న్ ఫ‌ర్మ్ చేసార‌ని స‌మాచారం.

డిసెంబర్ 4న గ్రాండ్ లెవల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ `ధృవ`. మెగాపవర్స్టార్ రాంచరణ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్పై సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రకటించిన రోజు నుండే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చేసిన ప‌నికి ప‌వ‌న్ అభినంద‌న‌లు..!

500, 1000 నోట్ల ర‌ద్దు చేయ‌డంతో ప్ర‌జ‌లు ఎంత ఇబ్బంది ప‌డుతున్నారో తెలిసిందే.  ఇక‌ హాస్ప‌ట‌ల్స్ లో ఉన్న రోగుల కుటుంబ స‌భ్యులు అయితే... నోట్ల ర‌ద్దుతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు.

చిరు 151, 152 రెడీ..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

యాడ్ షూట్ తో బిజీ

అఖిల్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోని అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్. ఇప్పుడు తన రెండో సినిమాపై అచి తూచి అడుగులేస్తున్నాడు.