close
Choose your channels

4 భాష‌ల్లో ఒకేసారి 'చ‌క్ర' ట్రైలర్ ని విడుద‌ల చేయ‌డం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది: విశాల్

Thursday, June 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

4 భాష‌ల్లో ఒకేసారి చ‌క్ర ట్రైలర్ ని విడుద‌ల చేయ‌డం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది: విశాల్

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మ‌నోబాలన్‌, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ `చ‌క్ర`‌ తెలుగు వెర్ష‌న్‌ పోస్ట‌ర్, `చ‌క్ర` గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఒకే సారి తెలుగు, తమిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో జూన్27(శ‌నివారం)విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు తెలిపింది చిత్ర‌యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత విశాల్ మాట్లాడుతూ - `` ఇటీవ‌ల విడుద‌ల చేసిన `చ‌క్ర` పోస్ట‌ర్‌కి, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ శ‌నివారం ఒకేసారి నాలుగు ద‌క్షినాది భాష‌ల్లో ట్రైల‌ర్స్‌ని విడుద‌ల చేయ‌డం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది`` అన్నారు. విశాల్ సూప‌ర్ హి‌ట్ మూవీ `అభిమ‌న్యుడు`త‌ర‌హా బ్యాంక్ రాబ‌రీ, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో సరికొత్త క‌థ-క‌థనాల‌తో ఈ చిత్రం రూపొందుతోంది.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.