'చల్ చల్ గుఱ్ఱం' పాటలు విడుదల

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు. శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ నటీనటులుగా ఎం.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తోన్న చిత్రం ఛల్ ఛల్ గుఱ్ణం'. వెంగి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమా పాటల బిగ్ సీడీని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. పాటల ఆడియో సీడీలను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి కాపీని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అందుకున్నారు.

ఈ సందర్భంగా....

పాటలు, ట్రైలర్ బావున్నాయి. వెంగి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

నాపై, నా కథపై నమ్మకంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాఘవయ్యగారికి థాంక్స్. మంచి ఎమోషనల్,లవ్, కామెడి అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా శైలేష్ రెండో సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడని దర్శకుడు మోహన్ ప్రసాద్ అన్నారు. ఆడియో, సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని నిర్మాత ఎం.రాఘవయ్య చెప్పారు.

అన్నీ వేరియేషన్స్ ఉన్న సాంగ్స్ ఈ చిత్రంలో ఉన్నాయని మ్యూజిక్ డైరెక్టర్ వెంగి అన్నారు. వెంగి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. సినిమా కమర్షియల్ వాల్యూస్ తో విజువల్ గా సినిమా చక్కగా ఉంటుందని హీరో శైలేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: రఘు, ప్రదీప్, అంథోని, భాను, ఎడిటింగ్: శంకర్, ఫైట్స్: రాం సుంకర, ఆర్ట్: జె.కె.మూర్తి, మ్యూజిక్: వెంగి, నిర్మాత: ఎం.రాఘవయ్య, దర్శకత్వం: మోహన ప్రసాద్.

More News

త్రిష లోని మరో కోణాన్ని ఆవిష్కరించే నాయకి మంచి విజయాన్నిసాధించాలి - నందమూరి బాలకృష్ణ

అగ్ర కథానాయిక త్రిష నటించిన హర్రర్ మూవీ నాయకి.ఈ చిత్రాన్ని గోవి తెరకెక్కించారు.తెలుగు,తమిళ్ లో రూపొందిన నాయకి చిత్రాన్ని గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు.

ర‌కుల్ కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌..

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్..కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌. అవును..! ఇది నిజంగా నిజం. ఈ విష‌యాన్నిస్వ‌యంగా ర‌కుల్ ప్రీత్ సింగే చెప్పంది. ఇంత‌కీ ర‌కుల్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా..?

మే లో చుట్టాల‌బ్బాయి..

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు.

త‌మ‌న్నా గురించి ర‌కుల్ కామెంట్..

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా..ఓ వైపు హీరోయిన్ గా చేస్తుంది..మ‌రో వైపు ఐటం సాంగ్స్ చేస్తుంది. అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో త‌మ‌న్నా ఐటం సాంగ్స్ చేసింది. తాజాగా జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో కూడా ఐటం సాంగ్ కోసం త‌మ‌న్నాని సంప్ర‌దిస్తున్నార‌ట‌.

కాశ్మీర్ లో రామ్ చరణ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.