close
Choose your channels

లారీని ఢీకొన్న చలాకి చంటి కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

Tuesday, June 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లారీని ఢీకొన్న చలాకి చంటి కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చంటి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళితే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా.. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ (NH 65) కొమరబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చంటి ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. చంటి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రమాదానికి చలాకి చంటిగా గుర్తించి చికిత్సకై ఆస్పత్రికి తరలించారు. కాగా.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదం అనంతరం కోదాడలోని తిరుమల ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స తీసుకుని అనంతరం హైదరాబాద్‌కు చంటి పయనమయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గత ఏడాది కూడా రోడ్డు ప్రమాదంలో చంటి క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. కాగా అప్పడు.. ఇప్పుడు క్షేమంగా చంటి బయటపడటంతో అభిమానులకు ఆందోళన తప్పింది. ఈ ప్రమాదంపై ఇంతవరకూ చంటి సోషల్ మీడియా వేదికగా కానీ.. మీడియాతో కానీ మాట్లాడలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.