వెబ్ సిరీస్‌గా చ‌లం న‌వ‌ల ‘ మైదానం’

  • IndiaGlitz, [Monday,July 13 2020]

వెండితెర‌కు స‌మానంగా డిజిట‌ల్ మీడియాకు ప్రాధాన్య‌త పెరుగుతోంది. ఈ క‌మ్రంలో ప‌లు ఓటీటీ సంస్థ‌లు, ఏటీటీ సంస్థ‌లు రెడీ అవుతున్నాయి. వీటికి త‌గినంత కంటెంట్ దొర‌క‌డం లేదు. దీంతో డిజిట‌ల్ మీడియాకు పెరుగుతున్నఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని సినీ రంగానికి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇక నిర్మాత‌లైతే ఓటీటీ కంటెంట్‌ను సినిమాల రూపంలో, వెబ్ సిరీస్‌ల రూపంలో జ‌న‌రేట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో ఒక‌ప్పుడు ఫేమ‌స్ అయిన న‌వ‌ల‌లు త్వ‌ర‌లోనే వెబ్ సిరీస్‌ల రూపంలో ప్రాణం పోసుకోనున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీనియ‌ర్ రైట‌ర్ మ‌ధుబాబు రాసిన ‘షాడో’ సిరీస్‌ను వెబ్ సిరీస్ రూపంలో తీసుకురాబోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవ‌లో ప్ర‌ముఖ ర‌చ‌యిత చ‌లం రాసిన ‘మైదానం’ న‌వ‌ల‌ను వెబ్ సిరీస్‌గా తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. ఇంత‌కూ చేయ‌బోయేది ఎవ‌రో కాదు..డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల. ఈయ‌న నిర్మాత‌గా మారి ‘మైదానం’ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడ‌ట‌. అంతా పూర్త‌య్యాక మ‌రిన్ని వివరాల‌ను తెలియ‌జేస్తాన‌ని ఆయ‌న తెలిపారు.

More News

టిఫిన్ సెంట‌ర్ ఓన‌ర్‌గా మారిన యువ హీరో

ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

సినిమా శాఖ‌ల్లో ఈ టీమ్ అస‌రం వ‌స్తుందా?

ఇప్ప‌టి వ‌ర‌కు 24 శాఖ‌లే సినిమాలకు ప‌నిచేస్తూ వ‌చ్చాయి. అయితే త్వ‌ర‌లోనే మ‌రో కొత్త శాఖ కూడా వీటితో జాయిన్ కానుంద‌ట‌.

అనంత పద్మనాభుని ఆలయ బాధ్యత వారిదే.. వివాదానికి చెక్ పెట్టిన సుప్రీం

కేరళలోనే ప్రఖ్యాతి చెందిన అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సంబంధించిన తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించింది.

రాజధానులపై అంత పట్టుదలా.. చంద్రబాబుకు ప్రయోజనం చేకూరవద్దనేనా?

ముచ్చటగా మూడు రాజధానులు.. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ కనీవినని కాన్సెప్ట్.

కరోనా నెక్లెస్.. అరగంట వేసుకుంటే 80 శాతం వైరస్ అవుట్..

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. అన్ని దేశాలూ అదే పనిలో బిజిబిజీగా ఉన్నాయి.