ఆడవాళ్ళపై నోరు జారిన చలపతిరావు

  • IndiaGlitz, [Monday,May 22 2017]

సీనియ‌ర్ న‌టుడు ఎన్నో సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సీనియ‌ర్ యాక్ట‌ర్ చ‌ల‌ప‌తిరావును అంద‌రూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. సాధార‌ణంగా చ‌ల‌ప‌తిరావు అడ‌ల్ట్ జోక్స్ వేస్తుంటాడు. ఇది స్క్రీన్ వెనుక వ‌ర‌కు ప‌రిమిత‌మైతే బావుండేది. కానీ లైవ్‌లో అంద‌రూ చూస్తుంటారు క‌దా అనే క‌నీస ఇంగితం కూడా మ‌ర‌చిపోయాడేమో కానీ ఆడ‌వాళ్ళ‌పై త‌న‌దైన రీతిలో నోరు పారేసుకున్నాడు ఈ సీనియ‌ర్ న‌టుడు. నిన్న జ‌రిగిన రారండోయ్ ఆడియో వేడుక‌లో చ‌ల‌ప‌తిరావు ఆడ‌వాళ్ళ‌పై నోరు పారేసుకున్నాడు.

ట్రైల‌ర్‌లో ఆడ‌వాళ్ళు మ‌న‌శ్శాంతికి హానికరం అనే డైలాగ్‌పై చిన్న‌పాటి డిస్క‌ష‌న్ జ‌రిగింది. ఆడియో హోస్ట్ చేసిన ర‌వి, గీతాభ‌గ‌త్‌ల్లో గీతా చల‌ప‌తిరావు ఈ విష‌యంపై ఓపినియ‌న్ అడిగితే, అమ్మాయిలు హానిక‌రం కాదు కానీ, పక్క‌లోకి ప‌నికొస్తారంటూ కామెంట్ చేయ‌డంతో లేడీ యాంక‌ర్ అవాక్కైంది. ఏం చెప్పాలో తెలియ‌క వెళ్ళిపోయింది. అయితే ఎంతో సీనియ‌ర్ న‌టుడైన చ‌ల‌ప‌తిరావు ఇలా అన‌డం ప‌ట్ల ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమారం రేగుతుంది. ఆడవాళ్ళ‌ను గౌర‌వించాల‌ని చెప్పే భార‌తీయ సంప్ర‌దాయాన్ని చెప్పాల్సిన ఇటువంటి సీనియ‌ర్ ప‌ర్స‌నే ఇలా చెప్ప‌డం త‌గ‌ద‌ని, సాధార‌ణంగా అడ‌ల్ట్ జోక్స్ వేసే చ‌ల‌ప‌తిరావు కెమెరా ముందు అలా అన‌డం భావ్యం కాద‌ని చాలా మంది అంటున్నారు.

More News

ముస్తాబవుతున్న గువ్వ గోరింక

వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో.. పూర్తి సహజమైన పాత్రలతో..

ముగాంబికను దర్శించుకున్న అనుష్క

దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఒకరైన అనుష్క ఇప్పుడు ఓ రకంగా వివిఐపి స్టేటస్ను అనుభవిస్తుందనుకోవాలి. అందుకు కారణం బాహుబలి-2. దేవసేనగా బాహుబలి-2లో మెప్పించిన అనుష్క బయట మాత్రం చాలా డీసెంట్గా కనపడతుంది.

రకుల్ ప్రీత్ విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' టీజర్

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి.

విల్లేజ్ లవ్ స్టొరీ తో రారా వేణుగోపాల నూతన చిత్రం ప్రారంభోత్సవం

శరవణ క్రియేషన్స్ పతాకంపై శ్రీ భూమానంద సమర్పించు 'రారా వేణుగోపాల' నూతన చిత్ర ప్రారంభోత్సవం సోమవారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరుపుకుంది.

సచిన్ కోసం రిపోర్టర్ గా మారింది

ప్రస్తుతం ఇండియాకు పేరు తెచ్చిన ఆటగాళ్ళ జీవిత కథల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. మేరీకోమ్, బాగ్ మిల్కాభాగ్, దంగల్ ఇలా చాలా సినిమాలే రూపొంది ప్రేక్షకుల ఆదరణను పొందాయి.