పవన్ డైరెక్టర్ కి ఛాలెంజింగ్ విషయం

  • IndiaGlitz, [Thursday,September 07 2017]

ప‌ద‌హారేళ్ల క్రితం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం అందుకున్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'ఖుషి'లో.. క‌థ‌ను మ‌లుపు తిప్పే ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించి మెప్పించాడు ఆ చిత్ర ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య‌. ఇప్పుడు అదే సూర్య పూర్తి స్థాయి విల‌నిజాన్ని రుచి చూపించ‌నున్నాడు ఇక్క‌డివారికి. త‌మిళుల‌కు ఆయ‌న న‌ట‌న బాగా అల‌వాటై పోయింది కానీ.. తెలుగువారికి అంత‌గా తెలియ‌దు.

తెలుగులో ఇప్ప‌టికే సూర్య‌ విల‌న్‌గా చేసిన మ‌హేష్ చిత్రం 'స్పైడ‌ర్' ఈ నెల 27న విడుద‌ల‌వుతోంటే.. ర‌వితేజ‌తో చేయ‌నున్న కొత్త చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 'స్పైడ‌ర్' తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతుండ‌గా.. త‌మిళ చిత్రం 'బోగ‌న్' ఆధారంగా ర‌వితేజ కొత్త సినిమా రూపొంద‌నుంది. అంటే.. సూర్య విల‌న్‌గా చేస్తున్న రెండు ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల్లో ఒక‌టి ద్విభాషా చిత్రం అయితే, మ‌రొక‌టి రీమేక్ అన్న‌మాట‌. మొత్తానికి ఎస్‌.జె.సూర్య‌కి ఇలాంటి సినిమాలు ఛాలెంజింగ్ విష‌య‌మే.

More News

'మహానుభావుడు' కి ఆ పాటే హైలెట్ అట

యువ కథానాయకుడు శర్వానంద్,యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్లో

ఏడేళ్ల త‌రువాత‌..

సందీప్ చౌతా.. ఈ పేరు విన‌గానే 'నిన్నే పెళ్లాడుతా', 'ప్రేమ‌క‌థ‌', 'సూప‌ర్‌', 'బుజ్జిగాడు' లాంటి మ్యూజిక‌ల్ హిట్స్ గుర్తుకువ‌స్తాయి. ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు చేసిన‌ప్ప‌టికీ గుర్తుండిపోయే బాణీలు ఇచ్చిన సందీప్‌.. తెలుగులో చివ‌రిగా చేసిన చిత్రం 'కేడి'.

విజ‌య్ ఆంటోనితో అంజ‌లి

తెలుగమ్మాయి అంజ‌లి.. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. 'అంగాడి తెరు' (షాపింగ్ మాల్‌), 'ఎంగేయుం ఎప్పోదుం' 'జ‌ర్నీ), 'ఇరైవి' త‌దిత‌ర త‌మిళ‌ చిత్రాల‌తో అంజ‌లి మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది.

నివేదా.. ట్రాక్ మారుస్తోందా?

'జెంటిల్ మన్','నిన్నుకోరి'చిత్రాలతో తెలుగువారిని ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్.

'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' పాటల విడుదల

ధర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురామ్ రొయ్యూరుతో కలిసి స్వీయ దర్శకత్వంలో