'ఛలో' దర్శకుడితో ప్రముఖ నిర్మాణ సంస్థ?

  • IndiaGlitz, [Saturday,February 10 2018]

ఏ రంగంలోనైనా విజయానికి ఉండే స్థానం ప్రత్యేకమే. కాని ఆ విజయం తొలి అడుగులోనే వరిస్తే.. ఇక ఆ విజయం జీవితంలో ఎంతో మధురంగా ఉంటుంది. అటువంటి విజయాన్ని ఛలో' సినిమాతో అందుకున్నారు ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల. యోగి, తేజ, త్రివిక్రమ్ దగ్గర స‌హాయ‌కుడిగా ప‌నిచేసిన అనుభవంతో ఈ సినిమాని రూపొందించారు.

త్రివిక్రమ్ శిష్యుడు కావడంతో ఈ చిత్రాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా మలిచి.. విజయం సాధించారు వెంకీ కుడుముల. ఇదిలా వుంటే...గతంలో అఆ' సినిమాని నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌ ఈ దర్శకుడితో ఓ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ కథను నిర్మాతకు చెప్పినట్టు...తుది మెరుగులు దిద్దిన తర్వాత ఈ మూవీని పట్టాలెక్కించనున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటీనటులతో హై బడ్జెట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More News

మే నుంచి వరుణ్ , సంకల్ప్ చిత్రం?

ఒకప్పుడు అనుభవం లేని దర్శకుడితో సినిమా చేయాలంటే ఆలోచించేవారు హీరోలు.

ఫిబ్రవరి 13 ప్రారంభం కానున్న 'సంత'

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం 'సంత'. మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు.

'తొలి ప్రేమ' ద‌ర్శ‌కుడి ఖాతాలో రెండు చిత్రాలు

మెగాహీరో వరుణ్ తేజ్, రాశిఖన్నా నాయకానాయికలుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'తొలిప్రేమ'. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. స‌ర్వ‌త్రా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాతో.. ద‌ర్శ‌కుడిగా మంచి మార్కులు కొట్టేశాడు వెంకీ అట్లూరి.

మార్చి8 కి టాకీ పూర్తి చేసుకోనున్న'భరత్ అనే నేను' ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన తాజా  షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పోరాట సన్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.

చైత‌న్య‌,రానాతో గ‌రుడ‌వేగ ద‌ర్శ‌కుడి చిత్రం

యువ కథానాయకులు నాగచైతన్య, రానా.. త్వ‌ర‌లోనే ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారా? అవున‌నే వినిపిస్తోంది.. టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. గతంలోనే వీరిద్దరూ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇటీవల ‘పి.ఎస్.వి.గరుడ వేగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు.. ఒక కథను ఈ ఇద్దరు యంగ్ హీరోల&