close
Choose your channels

Chalo Review

Review by IndiaGlitz [ Friday, February 2, 2018 • తెలుగు ]

కెరీర్ స్టార్టింగ్‌లో ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో స‌క్సెస్ కొట్టాడు హీరో నాగ‌శౌర్య‌. అయితే మ‌రే సినిమా త‌న‌కు మంచి విజ‌యాన్ని తెచ్చిపెట్టలేదు. దిక్కులు చూడ‌కు రామ‌య్యా, జో అచ్యుతానంద వంటి సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌లతో పాటు జాదూగాడు వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను కూడా ట్రై చేశాడు.. కానీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ఐరా క్రియేష‌న్స్ అనే బ్యానర్‌ను స్టార్ట్ చేసి నిర్మాణంలో కూడా అడుగు పెట్టిన శౌర్య చేసిన తొలి ప్ర‌య‌త్నం `ఛ‌లో`. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల. మ‌రి ఈ ఛ‌లో నాగ‌శౌర్య‌ను స‌క్సెస్ వైపు ఛలో అని చెప్పిందా?  లేదా అని తెలుసుకోవాలంటే కథ‌లోకి ఓ లుక్కేద్దాం..

క‌థ:

హ‌రి(నాగ‌శౌర్య‌)కి చిన్న‌ప్ప‌ట్నుంచి గొడ‌వలంటే ఎంతో ఇష్టం. అత‌ని త‌ల్లిదండ్రులు ( సీనియ‌ర్ న‌రేష్‌, ప్ర‌గ‌తి) కొడుకుని  గొడ‌వ‌లుండే ఊరికి పంపితే హ‌రి దారికొస్తాడ‌ని భావిస్తారు. అందుక‌ని చిత్తూరు జిల్లా తిరుపురం అనే ద‌గ్గ‌ర‌కు పంపుతారు. అక్క‌డ ప్ర‌జ‌లు తెలుగు, త‌మిళ వ‌ర్గాలు విడిపోయి కంచె వేసుకుని గొడ‌వ‌లు ప‌డుతుంటారు. ఒక‌రి ప్రాంతంలోకి మ‌రొక‌రు రాకూడ‌ద‌నే నిబంధ‌న‌గా ఉంటుంది. కాలేజ్‌లో చేరిన హ‌రి  అనుకోకుండా కార్తీక (ర‌ష్మిక మండ‌న్నా) ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటే రెండు వ‌ర్గాలు క‌ల‌వాల్సిందేన‌ని కార్తీక, హ‌రి కి కండీష‌న్ పెడుతుంది. దాంతోహ‌రి రెండు వ‌ర్గాల‌ను క‌లిపే బాధ్య‌త‌ను త‌ల‌కెత్తుకుంటాడు. ఇంత‌కు హ‌రి రెండు వ‌ర్గాల‌ను క‌లిపాడా?  లేదా? అనే విష‌యం  తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:

- న‌టీన‌టులు ప‌నితీరు
- సంగీతం
- సినిమాటోగ్ర‌ఫీ
- నేప‌థ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్‌:

- బ‌ల‌మైన క‌థ లేక‌పోవ‌డం
- కామెడీ రొటీన్‌
-  మోనాట‌నీ రొమాంటిక్ సీన్స్‌

విశ్లేష‌ణ‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే నాగ‌శౌర్య పాత్ర ప‌రంగా కొత్త‌గానే ట్రై చేశాడు. లుక్స్ ప‌రంగా కూడా త‌ను చూడ‌టానికి బాగా ఉన్నాడు. ఇక రష్మిక మండ‌న్నాకి ఇది తెలుగులో మొద‌టి చిత్రం. గ్లామ‌ర్‌గా తెర‌పై క‌న‌ప‌డింది. పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా కూడా త‌ను చ‌క్క‌గానే చేసింది. ఇక సీనియ‌ర్ న‌రేష్‌, రాజేంద్ర‌న్‌, స‌త్య‌, వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్ పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, ఇలా న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఫ‌స్టాఫ్ అంతా కాలేజ్‌లో హీరో హీరోయిన్స్ మ‌ధ్య ల‌వ్‌సీన్స్‌, కామెడీ ట్రాక్‌తో న‌డిచిపోతుంది. అస‌లు సినిమా సెకండాఫ్‌లోనే. లాజిక్ లేని స‌న్నివేశాలు, పాయింట్స్ సెకండాఫ్‌కు ప్రేక్ష‌కుడు ఎమోష‌న‌ల్‌గాద క‌నెక్ట్ కాడు. ఎవ‌రైనా గొడ‌వ‌లు ప‌డే కొడుకుని గొడ‌వలు లేని ఊరుకి పంపాల‌నుకుంటారు. ఇక్క‌డ తండ్రేంటో రివ‌ర్స్ అనిపిస్తాడు. అదేం లాజిక్కో అర్థం కాదు. సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం, నేప‌థ్య సంగీతం బావుంది. పాట‌లు ఎక్క‌డా ఇరికించ‌న‌ట్లు అనిపించ‌వు. సాయిశ్రీరామ్ ప్ర‌తి సీన్‌ను చాలా కొత్త‌గా తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.

రెండు ఊర్లు కొట్టుకోవ‌డం దాన్ని హీరో క‌ల‌పాల‌నుకోవ‌డం అనే పాయింట్‌పై చాలా సినిమాల‌నే చూశాం. అలాంటి పాయింట్‌తోనే ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల సినిమా చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే క‌థ‌నం విష‌యంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బావుండేద‌నిపించింది. ర‌ఘుబాబు, స‌త్య కామెడీ ట్రాక్‌... సెకండాఫ్‌లో వ‌చ్చే వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు ఇది వ‌ర‌కు చూశారు కాబ‌ట్టి కొత్త‌ద‌నం క‌నిపించ‌క‌పోవ‌చ్చు. అయితే స‌ర‌దాగా సినిమాను ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కులు ఇలాంటి లాజిక్స్ ప‌ట్టించుకోక‌పోతే సినిమా కనెక్ట్ అయిపోతారు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

బోట‌మ్ లైన్‌: ఆహ్లాదంగా సాగే రొటీన్ 'చలో'

Chalo Movie Review in English

 

Rating: 2.75 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE