చలో టీజర్, మూవీ రిలీజ్ డేట్స్

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

"ఊహ‌లు గుస‌గుస‌లాడే", "దిక్కులు చూడ‌కు రామ‌య్య‌", "ల‌క్ష్మిరావే మా ఇంటికి", "క‌ళ్యాణ‌వైభోగం","జ్యోఅచ్చుతానంద‌" లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్ష‌కుల్లో... ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగ‌శౌర్య. ఈ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఇటీవలే ఛలో అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఛలో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో.... న‌వంబ‌ర్‌ 18న ఛలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఛలో చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మీడియా సమావేశంలో నిర్మాతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ.... ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా నాగశౌర్య హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేసిన విష‌యం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఇండస్ట్రీ నుంచి అటు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ రావాడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాం. సినిమా కూడా అంతే బాగా వచ్చింది. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ట్రేడ్ లో బిజినెస్ కూడా ఆరేంజి లోనే జ‌రుగుతుంది.

ద‌ర్శ‌కుడు వెంకీ మంచి కథను కమర్షియాలిటీ మిస్ కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పారు. నాగశౌర్య పెర్ ఫార్మెన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తాడు. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అందుకే సినిమా ప్రమోషన్ ను సైతం విభిన్నంగా ప్లాన్ చేస్తున్నాం. న‌వంబ‌ర్‌ 18న ఛలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 29న ప‌క్కాగా ఛలో చిత్రాన్ని ప్రపంచ ప్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు.

దర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ... దర్శ‌కుడు త్రివిక్ర‌మ్ గారి అశీస్సుల‌తో ద‌ర్శ‌కుడుగా కెరీర్ స్టార్ట్ చేశాను. నాగ‌శౌర్య నటుడిగా నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన్ని ఛలో చిత్రం ద్వారా డిఫరెంట్ గా ప్రజెంట్ గా చేస్తున్నాను. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని నమ్ముతున్నాను.

ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ఇది. ఛలో చిత్ర టైటిల్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ ద్వారా ఫేమస్ అయ్యింది. ఈ చిత్రంలో చాలా బాగా చేసింది. నిర్మాతల అన‌టం కంటే మా ఫ్యామిలి అన‌టం నాకు ఇష్టంగా వుంటుంది. వారికి చాలా థాంక్స్. న‌వంబ‌ర్‌ 18న వచ్చే టీజర్ తో అంచనాలు పెరుగుతాయని నమ్ముతున్నాను. డిసెంబర్ 29న ఛలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అని అన్నారు.

చిత్ర సమర్పకుడు... శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ.... మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రం ఛలో. టైటిల్ కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో న‌వంబ‌ర్‌ 18న రిలీజ్ చేస్తున్న టీజర్ కు సైతం అంతే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం. నాగశౌర్య కు మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుందని ధీమాగా చెబుతున్నాం.

దర్శకుడు వెంకి కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. మా మొదటి చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ చాలా థాంక్స్. అని అన్నారు.

More News

'ఖాకి'లో కార్తి, రకుల్ కెమిస్ట్రీ

ఒక సినిమా హిట్ కావడానికి చాలా అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని సార్లు యాక్షన్, మరికొన్ని సార్లు కామెడీ.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్క జోనర్ అంశాలు పైచేయిగా నిలుస్తుంటాయి. అయితే ఎవర్గ్రీన్ విషయం, ఎవర్గ్రీన్గా యువ హృదయాలను కదిలించే అంశం రొమాన్స్.

ఏపీ ప్ర‌భుత్వం నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌భుత్వం 2014 నుండి 2016 వ‌ర‌కు నంది అవార్డుల ప్ర‌క‌టించింది. నంది అవార్డుల‌తో పాటు ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు, ర‌ఘుప‌తి వెంక‌య్య‌, బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించింది. మూడు ఏడాదిల‌కు క‌లిపి ఒకేసారి అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

గౌర‌వప్ర‌ద‌మైన అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో  అవార్డు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్ర‌తిష్టాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు మెగాస్టార్ కు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

జోరుగా 'ఖాకి' ప్రమోషన్స్

ఇవాళ్టి రోజుల్లో ప్రచారానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కష్టపడి చేసిన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో హీరోలు చాలా ముందుంటున్నారు.

సూర్య, కార్తీతో ఒకే ఏడాదిలో..

తెలుగు నాట సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఢిల్లీ డాళ్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే ద్విభాషా చిత్రం స్పైడర్ చిత్రంతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. మరో ద్విభాషా చిత్రం ఖాకితో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రకుల్ సందడి చేయనుంది.