క‌న్ ఫ్యూజ‌న్ లో ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ చందు..!

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

కార్తికేయ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. తాజాగా అక్కినేని నాగ చైత‌న్య‌తో ప్రేమ‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించి వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అయితే...ప్రేమ‌మ్ రిలీజ్ కి ముందే చందు మొండేటి మూడ‌వ చిత్రాన్ని ఏ సంస్థ‌తో చేయ‌నున్నాడో ఎనౌన్స్ చేసాడు కానీ...హీరో ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు. ఇదిలా ఉంటే...చందు మొండేటి చైత‌న్య‌తో సినిమా క‌న్నా ముందు నాగార్జున‌తో డిఫ‌రెంట్ పోలీస్ స్టోరీ తీయాల‌ని క‌థ రెడీ చేసుకున్నాడు.

ఆ టైమ్ లో నాగార్జున బిజీగా ఉండ‌డం వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇప్పుడు చందుని నాగార్జున ప్రేమ‌మ్ స‌క్సెస్ మీట్ లో నాతో సినిమా చేయ‌మ‌ని స్వ‌యంగా అడిగారు. చందు కూడా నాగార్జున‌తో చేయ‌డానికి రెడీ. అయితే....యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా చందు మొండేటితో సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ని, ఈ విష‌యం పై చందుతో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే క‌నుక నిజ‌మైతే...చందు త‌దుప‌రి చిత్రాన్ని ఫేవ‌రేట్ హీరో కింగ్ నాగార్జున‌తో చేస్తాడో..? యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో చేస్తాడో చూడాలి..!

More News

సమస్యల్లో 'ఆక్సిజన్'....?

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'లెజెండ్' 1000 రోజుల పోస్టర్ విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లెజెండ్` ఇప్పుడు విజయవంతంగా 950 రోజులను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తుంది.

చిరు సినిమా శాటిలైట్ హ‌క్కులు

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ  చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌.

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స్పెష‌ల్ స్టేట‌స్ సాధ‌న కోసం ప్ర‌తి జిల్లాలో పోరాట స‌భ‌ను జ‌న‌సేన నిర్వ‌హిస్తుంద‌ని తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన సేనాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

బాహుబలి - కాష్మోరా కి ఉన్న తేడా అదే - కాష్మోరా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్

తమిళ హీరో కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.