రవితేజతో మూవీ గురించి చందు ఏమన్నాడో తెలుసా..?

  • IndiaGlitz, [Monday,October 31 2016]

కార్తికేయ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించిన యంగ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి. ఇటీవ‌ల నాగ చైత‌న్య‌తో ప్రేమ‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించి రెండో సినిమాతో కూడా స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఇక చందు మూడ‌వ సినిమా గురించి రో్జుకో న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. చందు నెక్ట్స్ మూవీని నాగార్జున‌తో చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీని కార‌ణం ఏమిటంటే...చందు ఫ‌స్ట్ నాగార్జున‌తోనే మూవీ చేయాలి అనుకున్నాడు. ఆ టైమ్ లో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి చిత్రాల్లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న కుద‌ర‌లేదు. దీంతో చందు నెక్ట్స్ మూవీ నాగ్ తో ఉంటుంది అంటూ వార్త‌లు వ‌చ్చాయి.
ఆత‌ర్వాత ఎన్టీఆర్ చందుతో సినిమా చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న‌ట్టు ఇంకో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదిలా ఉంటే...తాజాగా మాస్ రాజా ర‌వితేజ‌తో చందు సినిమా చేయ‌నున్నాడు ఈ ప్రాజెక్ట్ క‌న్ ఫ‌ర్మ్ అంటూ కొత్త వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వార్త‌ల పై చందుని సంప్ర‌దిస్తే...ఇంకా నా నెక్ట్స్ మూవీకి హీరో ఎవ‌రు అనేది క‌న్ ఫర్మ్ కాలేదు. ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయిన వెంట‌నే ఎనౌన్స్ చేస్తాను అని తెలిపారు. అది సంగ‌తి..!

More News

ఏలూరులో పవన్ ఓటు..!

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో తన ఓటు నమోదు చేయించుకోవాలని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

దీపావళి మెగా ఫ్రేమ్ అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి,మెగా బ్రదర్ నాగబాబు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,

ఆన్ లైన్ లో 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం' ఆడియో రిలీజ్..!

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి,సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో

ఒకే ఒక సాంగ్ తో 'రోబో' సీక్వెల్

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్,అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0

శతమానంభవతి ఆడియో&మూవీ రిలీజ్ డేట్ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శతమానంభవతి.