కోడెల మృతిపై చంద్రబాబు, బాలయ్య ఆవేదన!

  • IndiaGlitz, [Monday,September 16 2019]

టీడీపీ కీలకనేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో కోడెల చిత్ర పటానికి నివాళులర్పించిన చంద్రబాబు.. అనంతరం మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ‘కోడెల మృతి తనను తీవ్రంగా కలచివేసింది. మానసిక క్షోభ, భరించలేని అవమానంతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. 3 నెలలుగా కోడెలను వేధింపులకు గురిచేశారు. ఆయన భయం ఎరుగని వ్యక్తి. అలాంటి వ్యక్తిని దారుణంగా వేధింపులకు గురిచేశారు. తెల్లారితే ఏం అవమానం చేస్తారో అని భయపడేంతగా హింసించి.. కోడెల ఆత్మహత్యకు పాల్పడేలా చేశారు. పార్టీ కార్యకర్తల హత్యలపై, రైతుల ఆత్మహత్యలపై పోరాటం చేశాం.. కానీ, కోడెల ఇలా ఆత్మహత్య చేసుకునే రోజు వస్తుందని ఊహించలేదు’ అని చంద్రబాబు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు.

జీర్ణించుకోలేని విషయం!

కోడెల మరణించారని తెలుసుకున్న నందమూరి బాలయ్య హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కోడెల భౌతికకాయాన్ని సందర్శించి కంటతడిపెట్టారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘కోడెల మరణం జీర్ణించుకోలేని విషయం. ఇది చాలా దుర్దినం. బసవతారకం ఆస్పత్రి మొదలు పెట్టినపుడు ఆయనే ఫౌండర్ ఛైర్మెన్. తెలుగుదేశం పార్టీలోనే కాదు.. మా కుటుంబంలో కూడా ఎప్పుడూ కోడెలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భౌతికంగా ఆయన మన మధ్య లేరు.. ఇది నిజంగానే నమ్మలేని నిజం. అప్పట్లో అమ్మగారి జ్ఞాపకార్థం నాన్నగారు ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నపుడు ఆయనతో పాటు కోడెల ముందడుగు వేసారని గుర్తు చేసాడు బాలయ్య. ఆస్పత్రికి పడిన తొలి ఇటుక నుంచి కూడా ఆయన తోడుగా ఉన్నారు’ అని బాలయ్య చెప్పుకొచ్చారు.

More News

సైరా ప్రిరీలీజ్ ఈవెంట్ వాయిదా..!?

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే తొలిసారిగా ‘సైరా’ అనే చారిత్రక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

బోటు ప్రమాద బాధితులను చూసి జగన్ భావోద్వేగం!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ఏరియల్ సర్వే నిర్వహించారు.

పవన్- ప్రభాస్‌తో మూవీపై క్లారిటీ.. ఎన్టీఆర్‌కు హిట్టిస్తా!

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌లతో సినిమా చేస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.

దిల్‌రాజుతో గొడవలపై హరీశ్ శంకర్ స్పందన

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వాల్మీకి’.

`RRR` బల్గేరియా షెడ్యూల్ పూర్తి

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `RRR`. దాదాపు రూ.300కోట్ల‌కుపై బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మాత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు.